twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ క్రిష్ భావోద్వేగం.... అమెరికా నుండి పర్శనల్ మెసేజ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'గౌతమీపుత్ర శాతకర్ణి' భారీ విజయం సాధించడంతో దర్శకుడు క్రిష్ ఆనందం పట్టలేక పోతున్నారు. తన కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పాటు అన్ని వైపుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతుండటంతో.... తన మనసులోని భావోద్వేగాలను ఇక ఆపుకోలేక పోయారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన తెలుగు ప్రేక్షకులు పర్సనల్ మెసేజ్ పంపారు.

    అమెరికా నుండి క్రిష్ తెలుగు ప్రేక్షకులకు పంపిన సందేశం ఇదే...

    ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..? ఒక దేశాన్ని గెలిచిన గర్వం... తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం.. మౌనం మాత్రమే చెప్పగల భావాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియటం లేదు.. చాలా మందికి తెలియని చరిత్రని చూపిస్తే కొత్తగా వుంటుందనుకున్నాను, కానీ ఆ చరిత్రే నన్ను కొత్తగా చూపిస్తుందని నేననుకోలేదు.. నాకైతే, నా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద, కళ్ళనిండా మనసు నింపుకుని సినిమా చూసే తీరుమీద, తీర్పు మీద నాకున్న నమ్మకం ఋజువయింది. అసంఖ్యాకమైన అభినందనలు ఇంకా వినిపిస్తూనే వున్నాయి.

    Director Krish personal message on GPSK success

    తెర మీద కరవాల ధ్వనులు, తెర ముందు కారతాళధ్వనులు, థియేటర్ల ముందు సాహో గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ నినదిస్తున్న ప్రతిధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయ్. ఫోన్లో అభినందనలు వింటుంటే మరెన్నో అభినందనలు బీప్ శబ్దాలు చేస్తూ ఎదురుచూస్తున్నాయి.. విశ్రాంతి లేదు, విరామం లేదు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి ఫోను 12వ తేదీ నుండి మోగుతూనే వుంది, మాట్లాడుతూనే వుంది.. వాళ్ళ కళ్లలో కదులుతున్న సంతోష తరంగాలు గొంతులలో వినిపిస్తున్నాయి, మనసుకి కనిపిస్తున్నాయి.

    ప్రతి చోటా, ప్రతి నోటా ప్రశంసల వర్షం కురుస్తూనే వుంది.. ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అన్న తేడా లేకుండా ప్రతి మాధ్యమం ప్రోత్సహిస్తూనే వుంది. ఏం చెప్పాలి.. ఎలా స్పందించాలి? ఇది తొంభై తొమ్మిది చిత్రాల నాటానుభవాన్ని తన వందవ చిత్రంలో ఆవిష్కరించిన ఒక మహానటుడి నటవిశ్వరూపం.. ఈ విజయం ఆయన అందించిన ప్రోత్సహాఫలం.. మన తెలుగు ప్రేక్షకులందరికి ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను.. నా జీవితంలో ప్రతినిమిషాన్ని మీకు చెప్పాల్సిన ఓ కృతజ్ఞతగా భావిస్తాను..

    మీ, అంజనాపుత్ర క్రిష్. (అమెరికా నుంచి...)

    English summary
    "How can I share or communicate my beaming emotions with you? Words fall short to describe the warmth of joy and endearing affection you showed on me. My silence speaks volumes without ever saying a word. I feel the pride of winning a Nation and sense the instinct of embracing whole Telugu land at once.I always had vast confidence on the interests and judgement of Telugu cinema loving audience and their empathising with good films. You gave birth to a new Krish in me by deeply respecting my first historical presentation of the story of an unsung Telugu warrior emperor Gautamiputra Satakarni." Anjanaputra Krish said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X