»   » క్రిష్ వాళ్ళ ఆవిడా... ఒక ముద్దూ..! మధ్యలో మరి ఈవిడ?? (ఈ ఫొటో చూడండి)

క్రిష్ వాళ్ళ ఆవిడా... ఒక ముద్దూ..! మధ్యలో మరి ఈవిడ?? (ఈ ఫొటో చూడండి)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని అతి తక్కువ వ్యవధిలో తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌. ఈ షూటింగ్‌ గ్యాప్‌లోనే ఆయన పెళ్లి చేసుకున్నారు. వెంటనే మళ్లీ షూటింగ్‌కు హాజరైపోయారు. పట్టుమని పదిరోజులు కూడా భార్యతో గడపలేదు. సినిమా షూటింగ్ సమయంలోనే డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఆమె సెట్స్ కి రావడం వలన శ్రియతో మంచి స్నేహం ఏర్పడింది. ఇటీవలే శ్రియ "రమ్య ఎంతో అందమైన వ్యక్తి .." ఆమెతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు రమ్య స్పందిస్తూ "ఇంతవరకూ నేను కలిసిన వాళ్లలో నువ్వు అద్భుతమైన మహిళవు .. అందమైన మనసు నీకు వుంది .. ఐ మిస్ యు" అంటూ ట్వీట్ చేసింది.

Director krish posted a photo with his wife

ఇదిలా ఉంటే, తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఓ అమ్మాయి క్రిష్‌కు ముద్దు పెడుతూంటే హీరోయిన్‌ శ్రీయ.. క్రిష్‌ గొంతు పట్టుకుని నొక్కేస్తోంది. ఇంతకీ.. ఆ ఫోటోలో క్రిష్‌కు ముద్దుపెడుతోంది ఎవరో తెలుసా? క్రిష్‌ భార్య రమ్య. 'గౌతమీపుత్రశాతకర్ణి' ఆడియో విడుదల సమయంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన భార్య అందించిన సహకారం మరువలేనిదని క్రిష్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

English summary
Director Krish Jagarlamudi posted a photo wihth his wife and Goutamiputra Satakarni heroine Shriya Saran in his Face Book Wall
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu