»   » కీర్తి సురేష్, దుల్కర్ హ్యాట్సాఫ్.. ఆ ఇద్దరే హీరోలు.. మాటలు రావడం లేదు.. క్రిష్

కీర్తి సురేష్, దుల్కర్ హ్యాట్సాఫ్.. ఆ ఇద్దరే హీరోలు.. మాటలు రావడం లేదు.. క్రిష్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Mahanati Team Gets Compliments From Director Krish

    అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు కేవీరెడ్డి పాత్రలో డైరెక్టర్ క్రిష్ నటించారు. క్రిష్ పోషించిన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ నేపథ్యంలో మహానటి చిత్రంపై, చిత్ర యూనిట్‌ గురించి ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో అలరించారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే..

     గొప్ప చిత్రంలో భాగమైనందుకు

    గొప్ప చిత్రంలో భాగమైనందుకు

    గొప్ప ఆత్మకథా చిత్రమైన మహానటి ఓ చారిత్రాత్మక చిత్రంగా మిగిలిపోతుంది. అంతటి గొప్ప చిత్రంలో చిన్న భాగమైనందుకు ఆనందంగా ఉంది అని క్రిష్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    నాగ అశ్విన్ ఎంత శ్రమించారో..

    నాగ అశ్విన్ ఎంత శ్రమించారో..

    మహానటి చిత్రాన్ని చూస్తున్నంత సేపు అద్భుతమైన భావోద్వేగానికి గురయ్యాను. ఆ ఫీలింగ్‌ను చెప్పడానికి మాటలు రావడం లేదు. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడానికి దర్శకుడు నాగ అశ్విన్ ఎంత శ్రమపడ్డారో ఊహకు అందని విషయం. అద్భుతమైన విజన్‌తో సినిమాటోగ్రాఫర్ డానీ తెరపైన దృశ్యకావ్యంగా మలిచారు. వారందరిపై అచెంచలమైన గౌరవం కలుగుతున్నది.

    కీర్తీ సురేష్ హ్యాట్సాఫ్

    కీర్తీ సురేష్ హ్యాట్సాఫ్

    మహానటి చిత్రంలో కీర్తీ సురేష్ అద్భుతమైన భావోద్వేగాలను తన నటనతో పలికించారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన ఆమెకు హ్యాట్సాఫ్. ఓ సూపర్‌స్టార్ విషాదకరమైన కథలో ఓ యువనటి చక్కగా ఒదిగిపోయింది. అద్భుతమైన నటనను ఇంతగా ప్రదర్శించిన ఓ హీరోయిన్‌ ఇప్పటివరకు చూడలేదని చెప్పడానికి నేను సంకోచించను అని క్రిష్ ట్వీట్ చేశారు.

    దుల్కర్ సల్మాన్‌ నటన సూపర్

    దుల్కర్ సల్మాన్‌ నటన సూపర్

    మహానటి లాంటి గొప్ప చిత్రంలో సానుభూతి, ద్వేషం కలిగి ఉన్న జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్‌కు తలవంచి నమస్కరిస్తున్నాను. ఆయన ప్రదర్శించిన నటనకు ముగ్దుడినయ్యాను. ప్రతికూల ప్రభావం చూపే జెమినీ పాత్రను చేసి మెప్పించాడు. నటనలో ఉత్తమ ప్రమాణాలను చాటిచెప్పాడు. కంగ్రాట్స్ దుల్కర్ అని క్రిష్ మరో ట్విట్ చేశారు.

     మహానటికి నిర్మాతలే హీరోలు

    మహానటికి నిర్మాతలే హీరోలు

    ఓ ఆలోచనను ప్రగాఢ విశ్వాసంతో నమ్మిన నిర్మాతలు ప్రియాంక, స్వప్నదత్ మహానటి చిత్రాన్ని గొప్పగా మలిచారు. ఈ చిత్రానికి వారే హీరోలు అని నమ్ముతాను. అద్భుతమైన ప్రేమకథను, జీవితాన్ని, సంబంధాలను సినీ తెరపై క్లాసిక్‌గా రూపొందించడంలో వారు సక్సెస్ అయ్యారు అని క్రిష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Savithri biopic Mahanati Teaser released. Actress Keerthy suresh is steps into Savithri's role. Samantha prabhu, Vijay Deverakonda, Director Krish are played key roles in this movie. This movie is slated to release on May 9th. In this occassion, Director Krish expressed his happyness on his role and praised the other actors, who are part of the film.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more