twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ ఫోటో చూశారా? చిన్నప్పుడే తండ్రికి మార్గదర్శిగా హరికృష్ణ!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Director Krish Shares Actor Harikrishna's Rare Photo

    నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తదితరులు ఇప్పటికే స్పందించగా తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హరికృష్ణకు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

    చిన్న వయసులో తన తండ్రి ముందు నడుస్తున్న హరికృష్ణ

    చిన్న వయసులో తన తండ్రి ముందు హరికృష్ణ నడుస్తున్నట్లు ఆ ఫోటోలో ఉంది. 'మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథి... చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం' అంటూ క్రిష్ ట్వీట్ చేశారు.

     1962 నాటి ఫోటో

    1962 నాటి ఫోటో

    1962లో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న సమయంలో ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణను ఓ ఫోటోగ్రాఫర్ తన లెన్సులో ఇలా అద్భుతంగా బంధించారు. హరికృష్ణ జ్ఞాపకాల్లోకి వెళ్లిన అభిమానులు ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

    అంతలోనే విషాదం

    అంతలోనే విషాదం

    సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టినరోజు వేడుక జరుగాల్సి ఉంది. ఏపీలోని కొన్ని జిల్లాలతో పాటు కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా పలువురు మరణించడం, వేల మంది నిరాశ్రయులైన నేపథ్యంలో ఆయన తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్నారు. బ్యానర్లు, బొకేలకు అయ్యే ఖర్చు వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని, వారికి దుస్తులు, వంట సామాగ్రి, మందులు, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతూ ఓ లేఖ రాశారు. ఇంతలోనే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

    డ్రైవింగులో ఎక్స్‌పర్ట్ కానీ...

    డ్రైవింగులో ఎక్స్‌పర్ట్ కానీ...

    హరికృష్ణ కారు ప్రమాదానికి గురికావడానికి కారణం అతి వేగమే అని పోలీసులు తేల్చారు. ప్రమాద సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని చెప్పారు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే... ప్రమాద తీవ్రత తగ్గేదని అన్నారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాదు నుంచి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. హరికృష్ణ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

    English summary
    Director Krish Shares Harikrishna Rare Photo. "Nandamuri Harikrishna garu leading NTR garu during the National Defence Fund activity in 1962." Krish tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X