డైరెక్టర్ కి అగ్నిపరీక్ష పెట్టిన మహేష్ బాబు..!
ఖలేజా తరువాత చెప్పినట్టుగానే మహేష్ బాబు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఒక దాని తరువాత ఒకటిగా ఫ్యాన్స్ కు వరుస సినీ విందు చేస్తున్నాడు. మహేష్ బాబు దూకుడు యాభై రోజులు 11.11.2011 నాటికి పూర్తయిన సందర్భంగా విజయవాడలో గ్రాండ్ గా అర్థశతదినోత్సవం కూడా జరుపుకొన్నారు చిత్ర యూనిట్.దూకుడు యాభై రోజులు పూర్తవ్వక ముందే తన కొత్త సినిమా బిజినెస్ మెన్ ట్రైలర్ పూర్తి రిలీజ్ చేసాడు. దీని తరువాత కూడా ఇదే స్పీడ్ లో దూకుడుగా ముందుకెలుతున్నాడు. జనవరిలో బిజినెస్ మెన్ రిలీజ్ అయిన వెంటనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో వెంకటేష్ తో కలిసి పాల్గొంటాడు.
దీని తరువాత మహేష్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటివరకు మహేష్ సినిమాలలో యువరాజు లో తప్ప అన్ని సినిమాలలోనూ ఒక్కరే హీరోయిన్. అయితే మొదటి సారి మహేష్ తో కలిసి క్రిష్ దర్శకత్వం వచించే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఎవరా హీరోయిన్లు అన్నది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.
కాగా ఈ ముగ్గురు కథానాయికలను సెట్ చేయడం డైరెక్టర్ క్రిష్ కి అగ్ని పరీక్షలా తయారయ్యిందని తెలుస్తోంది. ప్రిన్స్ ఇమేజ్ ని, అందాన్ని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్స్ ని సెట్ చేయాలి. అలా సెట్ చేయడం చాలా కష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ ముగ్గురు ప్రిన్స్ కి సరైన జోడిలా ఉండాలని, లేకపోతే విమర్శలు ఎదుర్కొనే అవకాశముందని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడట. అందుకే హీరోయిన్ ల వేట క్రిష్ కి కష్టతరంగా మారిందని సమాచారం.


Click it and Unblock the Notifications











