క్రిష్ పెళ్లి లో కిలకిలలు,కితకితలు, స్టార్స్ సరదాలు,సందడులు (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) వివాహం డా.రమ్యసాయితో హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది.

మేళతాళాలు, వేదమంత్రాల ఆదివారం మధ్య రాత్రి 9గంటల 5నిమిషాలకి జీలకర్ర, బెల్లం తంతుతో కొత్త జంట ఒక్కటైంది. ఈ వివాహానికి సంభందించిన వీడియోని మీరు ఇక్కడ అందిస్తున్నాం.

ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో జరిగిన దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ, డా. రమ్యసాయిల వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

''దేవతలే బంధువుల్లా వస్తారంట... మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే... మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు''...

నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతోంది... మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ పంపిన ఆహ్వానాన్ని అందుకొని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

'గమ్యం' నుంచి 'కంచె' వరకూ విలక్షణ చిత్రాలు తీసిన దర్శకుడు క్రిష్ తన వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కూడా కొత్తదనం చూపించారు.ఇంత ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఎవరికి మాత్రం వెళ్లాలని ఉండదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, రామ్‌, గోపీచంద్‌, కార్తి, శ్రీకాంత్‌, సుమంత్‌, సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి వచ్చారు.

ఇక హీరోయిన్స్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రాశీ ఖన్నా, ప్రగ్యాజైశా, తెదేపా నేత నారా లోకేష్‌, లక్ష్మీప్రసన్న తదితరులు హాజరయ్యారు. తమిళ, హిందీ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన జంటని ఆశీర్వదించారు.

స్లైడ్ షోలో పెళ్లి ఫొటోలు చూడండి..

బాలయ్య

బాలయ్య

క్రిష్ వివాహ వేడుకకు బాలయ్య హాజరయ్యారు

ఘనంగా

ఘనంగా


క్రిష్ వివాహ వేడుక వేద మంత్రాల మధ్య ఘనంగా జరిగింది

అంతా

అంతా


క్రిష్ వివాహ వేడుక కు ఇండస్ట్రీ అంతా తరిలి వచ్చింది.

రామ్ చరణ్

రామ్ చరణ్

మెగా హీరో రామ్ చరణ్ క్రిష్ వివాహ వేడుకకు హాజరయ్యారు

వెంకీ

వెంకీ


విక్టరీ వెంకటేష్ క్రిష్ వివాహ వేడుక కు హాజరయ్యారు

ఉషారు

ఉషారు


నూతన దంపతులు ఇద్దరూ వివాహవేడుక ఆధ్యంతం ఉషారుగా ఉన్నారు.

ఇలా

ఇలా

అప్పుడప్పుడు నూతన దంపతులు ఇలా చూసుకుంటూ...సరదాగా

పెళ్లి కొడుకాయనే

పెళ్లి కొడుకాయనే


కొబ్బరి బొండాం పట్టుకుని దర్శకుడు క్రిష్ ఇలా

చిరు ఆశ్వీరాదం

చిరు ఆశ్వీరాదం

చిరు కాళ్లకు మొక్కి దంపతులు ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు

విషెష్

విషెష్


చిరంజీవి...నూతన దంపతులకు బెస్ట్ విశెష్ తెలియచేసారు

ఏం అడుగుతున్నారో

ఏం అడుగుతున్నారో


బాలయ్య...కొత్త పెళ్లి కొడుకుని ఏం అడుగుతున్నారో మరి

ఆశ్వీరచనం

ఆశ్వీరచనం


బాలయ్య నూతన దంపతులిద్దరినీ ఆశ్వీర్వదించారు

ఒకటయ్యే సమయం

ఒకటయ్యే సమయం

నూతన దంపతులు ఇధ్దరూ ఒకటి అయ్యే క్షణాల్లో..

బాలయ్య

బాలయ్య


నూతన దంపతులను బాలయ్య ఆశ్వీరిదిస్తున్న వేళ..

బాలయ్యకు

బాలయ్యకు

బాలయ్యకు తన వాళ్లను క్రిష్ పరిచయం చేస్తున్నప్పుడు

గ్రూఫ్ ఫొటో

గ్రూఫ్ ఫొటో


బాలయ్య ..కొత్త దంపతులతో గ్రూఫ్ ఫొటో దిగుతూ..

మామా, అల్లుడు

మామా, అల్లుడు

నారా లోకేష్, బాలయ్య ఒకేసారి నూతన దంపతుల వద్ద

లోకేష్ విషెష్

లోకేష్ విషెష్

పూల బొకేలతో నారా లోకేష్ విషెష్ తెలియచేసారు

లోకేష్ తో

లోకేష్ తో

లోకేష్ , బాలయ్యలతో కొత్త దంపతులు గ్రూఫ్ ఫొటో

వెళ్తాను

వెళ్తాను


లోకేష్ ఇక బయిలుదేరతాను అన్నట్లు నమస్కారం చేస్తూ...

మధుర ఘట్టం

మధుర ఘట్టం


నూతన దంపుతల జీవితంలో ఇదో మధుర ఘట్టం

పెళ్లి కూతురు

పెళ్లి కూతురు


వేద మంత్రాల సాక్షిగా ఒకటయ్యే క్షణాలు కోసం ఎదురుచూస్తూ పెళ్లి కూతురు

జీలకర్రా బెల్లం

జీలకర్రా బెల్లం


నూతన దంపతులు ఇధ్దరూ జీలకర్రా, బెల్లం పెట్టుకునే సమయం

సుముహూర్తం

సుముహూర్తం

ఇదే సుమూహూర్త సమయం..ఇద్దరూ ఇలా ..ఒకటయ్యిన క్షణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X