twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాస్టింగ్ కౌచ్.. ఆ విషయం నా వరకు వస్తే వదిలిపెట్టను: డైరెక్టర్ కృష్ణవంశీ

    |

    తెలుగుదనం ఉట్టిపడేలా ఎన్నో ట్రెడిషనల్ సినిమాలను అలాగే మంచి సందేశాత్మక చిత్రాలను అందించిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ మరికొన్ని రోజుల్లో రంగమార్తాండ అనే మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఒకప్పుడు ఖడ్గం మురారి మహాత్మా గోవిందుడు అందరివాడేలే ఇలా ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన ఆయన కొన్నాళ్ల అనంతరం వరుసగా అపజయాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

    ఆయన నుంచి ప్రస్తుతం ప్రేక్షకులు చందమామ లాంటి సినిమాలను కోరుకుంటున్నారు అని చెప్పవచ్చు. తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ అలాంటి సినిమాలను చేస్తాను అని కూడా కృష్ణవంశీ తెలియజేశాడు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది మహిళలు ఉన్న ఏ ఇండస్ట్రీలో ఆయన ఉంది అని కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఉంది అనడం కరెక్ట్ కాదు అని అన్నారు.

    Director krishna vamshi latest comments on casting couch

    అంతేకాకుండా తన సినిమాకు సంబంధించి అలాంటి విషయంలో ఎవరైనా మహిళలను ఇబ్బంది పెడుతున్నారు అని తెలిస్తే మాత్రం అస్సలు వారిని వదిలిపెట్టను అని మహిళలను ఇబ్బంది కలిగించే ఎవరైనా కూడా తన టీం లో ఉండనివ్వను అని కృష్ణవంశీ తెలియజేశారు. ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇతర పరిశ్రమలలో కూడా చాలానే ఉంది అని అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని అన్నారు. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ బ్రహ్మానందం కూడా కొన్ని ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ అవుట్ పుట్ పై కూడా దర్శకుడు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ చాలానే వచ్చినప్పటికీ కూడా నిర్మాతలు థియేటర్లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Director krishna vamshi latest comments on casting couch..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X