చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్‌ వల్లే ప్రాణాలతో బయటపడ్డా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కృష్ణ వంశీ

ఒకప్పుడు క్రేజీ సినిమాలు తీసిన దర్శకుడిగా కృష్ణవంశీకి పేరు ఉండేది. ఖడ్గం, చంద్రలేఖ, నిన్నే పెళ్ళాడుతా వంటి అనేక సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఈ మధ్య కాలంలో అయితే సరైన హిట్ అందుకోలేదు. చివరిగా నక్షత్రం అనే సినిమా చేసిన కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ అనే సినిమా చేశారు. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ వివరాలలోకి వెళితే

అనతి కాలంలో

అనతి కాలంలో


రాంగోపాల్ వర్మ శిష్యుడిగా తన కెరీర్ ప్రారంభించిన కృష్ణవంశీ అనతి కాలంలోనే తెలుగులో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలు చేసే దర్శకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఆయన మెగా ఫ్యామిలీతో మంచి సంబంధం బాంధవ్యాలు కలిగి ఉన్నారు. వారితో ఎక్కువ సినిమాలు చేయకపోయినా మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అంటూ పిలిచే కృష్ణవంశీ మెగాస్టార్ చిరంజీవితో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు.

ఇంటికి పిలిపించారని

ఇంటికి పిలిపించారని

తాను ఇబ్బందుల్లో ఉన్నానన్న సంగతి తెలుసుకొని తన కుమారుడితో గోవిందుడు అందరివాడేలే సినిమా చేయమని మెగాస్టార్ ప్రోత్సహించారని అన్నారు. తనను చాలా సందర్భాల్లో మెగాస్టార్ అలాగే ప్రోత్సహిస్తూ వచ్చారని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తున్న సమయంలో సరదాగా ఆయన కారు చూసి ముచ్చటపడి అన్నయ్య దీనిని నాకు గిఫ్ట్ గా ఇచ్చేయొచ్చు కదా అని అన్నానని అప్పటికైనా నవ్వేసి ఊరుకున్నారు కానీ కొద్దిరోజుల తర్వాత నన్ను ఇంటికి పిలిపించారని అన్నారు.

 తీసుకోక తప్పలేదని

తీసుకోక తప్పలేదని

కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత ఈ కారు నీకు గిఫ్టుగా ఇద్దామనుకుంటున్నానని అన్నారని అన్నారు. నేను సరదాకి అన్నానని ఎంత చెప్పినా వినకుండా ఆయన నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే వద్దన్నా బలవంత పెట్టడంతో తను తీసుకోక తప్పలేదని ఆ కారుని బాగా పడే వాడినని చెప్పుకొచ్చారు.

బతికి బయటపడ్డా

బతికి బయటపడ్డా

అయితే ఒకసారి నందిగామ వెళ్లి తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఒక భారీ యాక్సిడెంట్ జరిగింది కానీ ఆ కారు కారణంగానే తాను బతికి బయటపడ్డానని అన్నయ్య చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ కారణంగానే బతికి బయటపడ్డానని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తన భార్య రమ్యకృష్ణతో విడాకులు, విభేదాల వ్యవహారం మీద కూడా స్పందించారు. ఇప్పటివరకు ఆయన ఈ విషయం మీద స్పందించకపోతే ఏదైనా నిజం ఉందని అనుకున్నారు కానీ ఈ విషయం మీద ఆయన క్లారిటీ ఇవ్వడంతో కొంతవరకు క్లారిటీ వచ్చినట్లు అయింది.

రంగ మార్తాండ

రంగ మార్తాండ


ఇక మరాఠీలో సూపర్ హిట్ గా నిలిచిన నట సామ్రాట్ అనే సినిమాని తెలుగులో రంగ మార్తాండ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు ఈ సినిమాతో మళ్లీ సూపర్ హిట్ కొడతారని కృష్ణవంశీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X