HanuMan: హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బాగుంది.. తెలుగు బడా డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్

ఒక్కోసారి తక్కువ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు కూడా ఆరంభంలోనే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుంటాయి. తద్వారా ఎవరూ ఊహించని రీతిలో గ్రాండ్‌గా రిలీజ్ అయి.. ప్రేక్షకుల మద్దతును అందుకుంటాయి. అలాంటి చిత్రాల కోవలోకే వస్తుంది గత సంక్రాంతికి విడుదలైన 'హనుమాన్'. చిన్న సినిమానే అయినా భారీ ప్రభావాన్ని చూపించే విధంగా దీని ప్రయాణం సాగింది. దీంతో ఎన్నో రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'హనుమాన్' మూవీ సక్సెస్‌పై తెలుగు బడా డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఆ వివరాలను మీరే చూడండి!

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. రియల్ సూపర్ హీరో అయిన ఆంజనేయ స్వామి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చింది. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ కూడా లభించాయి.

Director Krishna Vamsi Shocking Reaction On HanuMan Movie Success

విజువల్ వండర్‌గా రూపొందిన 'హనుమాన్' మూవీకి ప్రేక్షకులు ఇప్పటికీ మంచి స్పందనను అందిస్తున్నారు. దీంతో ఈ చిత్రం నెల దాటినా 300 థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. అదే సమయంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 155 కోట్లకు పైగా వరకూ షేర్‌ను వసూలు అయింది. తద్వారా దీనికి రూ. 124 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతం అయ్యాయి.

తక్కువ బడ్జెట్‌తోనే వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'హనుమాన్' మూవీపై తాజాగా ఓ నెటిజన్ విభిన్నంగా స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'ఎందుకో తెలీదు.. నాకు హనుమాన్ మూవీ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే నచ్చింది. శ్రీ ఆంజనేయం సూపర్ సినిమా. పిచ్చి నా కొడుకులకు అర్థం కాలేదు' అంటూ రాసుకొచ్చాడు.

సదరు నెటిజన్ చేసిన ట్వీట్‌పై 'శ్రీ ఆంజనేయం' మూవీ దర్శకుడు కృష్ణ వంశీ స్పందించారు. ఈ మేరకు అతడికి సమాధానంగా 'ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయరు. వాళ్లకు నచ్చకపోవడం అంటే సినిమా వాళ్లకు చేరడంలో సమస్య ఉండి ఉండొచ్చు. కాబట్టి ప్రేక్షకులను నిందించకండి. అలాగే, నేను కొన్నింటిలో తప్పు చేసి ఉండవచ్చు. థ్యాంక్యూ.. గాడ్ బ్లెస్' అని చెప్పారు.

Director Krishna Vamsi Shocking Reaction On HanuMan Movie Success

ఇదిలా ఉండగా.. రియల్ సూపర్ హీరో బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X