Balakrishna ఎవరైనా నవ్వితే తట్టుకోలేడు, చెత్త బిహేవియర్​ - బాలయ్యపై ప్రముఖ డైరెక్టర్​ సంచలన కామెంట్స్​!

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరాయన. ఆరు పదుల వయసులోనూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. అయితే సినిమాలు, యాక్టింగ్​ సంగతి పక్కన పెడితే ఆయన ఆఫ్​ స్క్రీన్​ పలు సందర్భాల్లో చాలా హార్డ్​గా కనిపిస్తారు. ఏది పడితే అది మాట్లాడుతూ, తిడుతూ అభిమానులపై చేయి కూడా చేసుకుంటుంటారు. అయితే తాజాగా ఆయన గురించి ఓ ప్రముఖ దర్శకుడు షాకింగ్ విషయాలన్ని బయటపెట్టారు. సెట్స్​లో బాలయ్య వరస్ట్​ బిహేవియర్ ఎలా ఉంటుందో వివరిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో అభిమానులను కొట్టే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే టక్కున ప్రతిఒక్కరికీ గుర్తొచ్చే పేరు .నందమూరి నటసింహం బాలకృష్ణ. అభిమానులు దగ్గరికి వచ్చినప్పుడు దూరం పెట్టడం, సెల్ఫీలు అడగడానికి ప్రయత్నిస్తుంటే వారని కొట్టడం, ఫోన్ లాక్కోని పడేయడం వంటివి చేస్తుంటారు. అంతే కాదు తన కన్నా పెద్ద సెలబ్రిటీలను కూడా స్టేజ్​పైనే నోరు దురుసుతనంతో మాట్లాడటం వంటి చేస్తుంటారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలే నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

Director ks ravikumar sensational comments on Nandamuri balakrishna behaviour

అయితే మరికొంతమంది మాత్రం దీనికి భిన్నంగా బాలయ్య ప్రవర్తన గురించి చెబుతుంటారు. బాలయ్య మాటలే కఠినమని, మనసు వెన్నెలాంటిదని అంటుంటారు. ఏదో ఫ్లోలో అనేస్తారని, అంతేతప్ప ఆయన మనసులో ఏ చెడు ఉద్దేశం ఉండదని అంటుంటారు. మరి ఇందులో ఏది నిజమో తెలీదు కానీ బయట చక్కర్లు కొట్టే వీడియోల ద్వారా బాలయ్య గురించి చాలా మంది నెగటివ్​గా అనుకుంటుంటారు.

తాజాగా బాలయ్యపై ఆయన ప్రవర్తించే తీరుపై ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ సంచలన షాకింగ్ కామెంట్స్ చేశారు. సెట్స్​లో బాలయ్య జనాలను కొడతారని చెప్పుకొచ్చారు. గార్డియన్‌ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్‌ ఇవెంట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. షూటింగ్‌ సమయంలో ఎవరు నవ్వినా బాలయ్య అస్సలు తట్టుకోలేరని, ఓ సమయంలో తన అసిస్టెంట్ డైరెక్టర్‌ను కూడా కొట్టబోయారని బాలయ్య బిహేవియర్​ను బయటపెట్టారు . కాగా, ఈ దర్శకుడు తెలుగు వారికి కూడా తెలిసే ఉంటుంది. బాలయ్యతో జై సింహా, రూలర్ వంటి చిత్రాలు చేశారు.

Director ks ravikumar sensational comments on Nandamuri balakrishna behaviour

"చిత్రీకరణ సమయంలో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే బాలయ్య అస్సలు తట్టుకోలేడు. తనని చూసే అంతా నవ్వుకుంటున్నారని భావిస్తాడు. వెంటనే ఆయనకు కోపం వచ్చేస్తుంది. నవ్వే వ్యక్తిని పిలిచి మరీ కొడతారు. అలా ఓ సారి నా అసిస్టెంట్​ను కొట్టబోయారు. తన విగ్గును చూసే నవ్వుతున్నాడని అనుకుని కోపంతో అరిచారు. నేను అడ్డుపడి సర్ది చెప్పాను" అని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్​గా మారాయి. అందరూ ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా, బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్​బీకే 109 సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జులై విడుదల చేస్తారని బయట టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం కూడా పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​లో రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X