twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంచలనంగా మారిన సిరివెన్నెల చివరి ఫోన్‌ కాల్‌.. క్షమాపణలు కోరుతున్నా అంటూ యువదర్శకుడు ఎమోషనల్!

    |

    పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి ఫోన్‌ కాల్‌గా భావిస్తున్న ఆడియో మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం సహకరించడం లేదని తెలిసినా తర్వాత జోకులు వేస్తూ యువ దర్శకుడు కూచిపూడి వెంకట్‌తో మాట్లాడిన విషయాలు అందరినీ కంటతడి పెట్టేలా చేశాయి. వాసు అనే సినిమా దర్శకుడు కూచిపూడి వెంకట్‌తో సీతారామశాస్త్రి మాట్లాడిన ఫోన్ కాల్‌లో తాను సర్జరీకి ముందు మణికొండలోని తన కూతురు ఇంట్లో ఉంటున్నా అని చెప్పారు. వెంకట్ కూచిపూడి ఫోన్ చేయడంతో ఎలా ఉన్నావు అమ్మా అంటూ పలకరించారు. అయితే అదే ఫోన్ కాల్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

    ఊపిరితిత్తులను తీసేశారు

    ఊపిరితిత్తులను తీసేశారు

    కూచిపూడి వెంకట్‌తో సిరివెన్నెల మాట్లాడుతూ.. సోమవారం నాడు ఆపరేషన్ ఫిక్స్ అయిందని, ఊపిరితిత్తులకు సర్జరీ జరుగుతుందన్నారు. సర్జరీ తర్వాత డిసెంబర్ మొత్తం నేను రెస్ట్ లోనే ఉంటాను అని సిరివెన్నెల చెప్పారు. అయితే ఏం జరిగింది సార్ అని కూచిపూడి వెంకట్ అడిగితే.. నీకు తెలియదా 2015లో నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది అని, ఎడమవైపు ఊపిరితిత్తులను తీసేశారని. ఇప్పుడు కుడివైపు వచ్చిందన్నారు.

    డబ్బు అప్పుగా ఇచ్చా

    డబ్బు అప్పుగా ఇచ్చా

    ఈ సందర్భంగానీ సినిమా వాసుకు పాటలు రాయాలి కదా.. ఈనెల, రెండు నెలల్లో రాయలేదు కదా.. రాయలేకపోతే చూడు. నేను రెండు తీసుకొన్నాను. తిరిగి ఇవ్వను అంటూ హా హా అంటూ నవ్వారు. మళ్లీ జనజీవన స్రవంతిలోకి వచ్చాక నేను రాస్తా అని సిరివెన్నెల చాలా చలాకీగా నవ్వుతూ ఫోన్‌లో సంభాషించారు. అయితే ఇక్కడ రెండు అనే పదాన్ని రెండు లక్షలుగా భావించి గురువు గారు సీతారామ శాస్త్రి గారికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చానని కొంత మంది నాకు ఫోన్ చేయడం, చాలా బాధగా ఉందని కూచిపూడి వెంకట్ పేర్కొన్నారు.

     హాస్పిటల్ కి వెళుతూ పరిహాసం

    హాస్పిటల్ కి వెళుతూ పరిహాసం

    ఇది పూర్తిగా తప్పని, ఆయన కుటుంబ సభ్యులు కూడా దాని గురించి బాధ పడి ఉంటారని నేను నమ్ముతున్నానని ఆయన అన్నారు. నా 'మొదటి సినిమా' పాటల కోసం నేను ఆయనకు చెల్లించిన 2 లక్షలు గురించి గురు గారు ప్రస్తావించారని ఆయన అన్నారు. ఆయన హాస్పిటల్ కి వెళుతూ కూడా పరిహాసం ఆడారు. ఆయన నాకు సహాయం చేశారు, ఎలా అంటే అప్పట్లో ఆయన తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నారు, ఆయన ఒక పాటకు రెండు లక్షలు వసూలు చేస్తున్న సమయంలో కూడా నా సినిమాలో మొత్తం ఆరు పాటలు రాసి కేవలం రెండే లక్షలు తీసుకున్నారన్నారు.

    ఆశీర్వదించబడ్డా


    అలా ఆయన నాపై కురిపించిన ప్రేమతో నేను ఆశీర్వదించబడ్డాను, దానికి తగ్గట్టు నేను ఆయనకు ఎప్పుడూ ఉపకారం చేయలేదు కానీ నేను విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. నిజానికి, ఆ సమయంలో నా దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తే ఆయన నాకు సహాయం చేయలేనని భావించి తక్కువ ఛార్జ్ చేశారని అన్నారు. ఈ కాల్‌ని తప్పుగా అర్థం చేసుకోవడంతో, గురువు గారి కుటుంబానికి.. స్నేహితులకు మరియు అభిమానులకు చాలా బాధ కలిగించిందన్నారు.

     క్షమాపణలు కోరుతున్నా

    క్షమాపణలు కోరుతున్నా

    వారికి కలిగిన బాధ కంటే నేను ఎక్కువ నొప్పిని అనుభవిస్తున్నా, అయినా సరే నా వల్ల జరిగింది కాబట్టి దానికి నేను క్షమాపణలు కోరుతున్నానని ఆయన అన్నారు. . గురు గారు లేకపోతే నా మొదటి సినిమా లేదు. అలాంటి వ్యక్తి నాకు కాల్ చేయడం ఇక ఎప్పటికీ జరగదు, నన్ను దీవించినందుకు ధన్యవాదాలు అండీ, గురు గారూ నా పిలుపు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను అంటూ ఎమోషనల్ అయ్యారు.

    English summary
    Director kuchipudi venkat, sirivennela seetharamasastry,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X