Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జాతిరత్నాలు సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. అందులో క్యాష్ అనుదీప్ కూడా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన అనంతరం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న చిత్రాంగా జాతిరత్నాలు మంచి క్రేజ్ అందుకుంటోంది. చాలా రోజుల తరువాత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న చిన్న బడ్జెట్ చిత్రం ఇదే. ఒక సినిమా హిట్టయితే దానికి సీక్వెల్ రావడం సహజమే. అలాగే జాతిరత్నాలు సినిమాకు కూడా సీక్వెల్ వస్తే బావుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక ఆ విషయంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.
జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)
సెకండ్ వీక్ కూడా
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా జాతిరత్నాలు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కామెడీ సినిమాల పవర్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. కరోనా లాంటి కఠినమైన పరిస్థితుల తరువాత ఒక మంచి కామెడీ సినిమా రావడం బాక్సాఫీస్ కు బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందించిన ఈ సినిమా సెకండ్ వీక్ కూడా అదే ఫ్లోను కొనసాగించేలా ఉంది.
అతని వల్లే సగం క్రేజ్
జాతిరత్నాలు సినిమాను డైరెక్ట్ చేసిన అనుదీప్ కు కూడా మంచి క్రేజ్ దక్కింది. అతని రియల్ క్యారెక్టర్ తోనే సినిమాకు సగం బజ్ క్రియేట్ చేశారు. మొదట క్యాష్ షోలో అతను చేసిన హడావుడికి భారీ స్థాయిలో క్రేజ్ దక్కింది. అటు నుంచి ఈ అనుదీప్ ఎవరు అనే పాయింట్ హైలెట్ అవుతూ సినిమాపై ఇంకాస్త బజ్ క్రియేట్ అయ్యింది.
హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో (ఫొటోలు)
సీక్వెల్ పై ఆశలు
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన కామెడీ టైమింగ్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. వాళ్ళు చేసిన పాత్రలు చెప్పిన డైలాగ్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తుంటే జాతిరత్నాలు హవా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. సినిమా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మరో సీక్వెల్ ఉంటే బావుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు.
క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
శుక్రవారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే వేడుకలో రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని మాట్లాడగా వెంటనే దర్శకుడు తప్పకుండా ఉంటుందని చెప్పేశాడు.
సుమ మాట నిజమైతే..
యాంకర్ సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సక్సెస్ ఈవెంట్ లో కూడా యాంకర్ గా కొనసాగారు. అక్కడ కూడా అనుదీప్ పై ఆమె పంచులు వేశారు. ఇక సీక్వెల్ గా గనక వస్తే అందులో అనుదీప్ కూడా మరో కీలకమైన క్యారెక్టర్ లో ఉంటే బావుంటుందని చెప్పారు. అదే నిజమైతే సినిమాకు బజ్ ఈజీగా పెరిగిపోవచ్చు. ఇక జాతిరత్నాలు సినిమాలో అనుదీప్ ఒక చిన్న సీన్ లో కనిపించిన విషయం తెలిసిందే.