twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాళి మాత నోట్లో సిగరెట్.. ఆ దర్శకురాలి అరెస్ట్‌కు డిమాండ్.. ప్రధాని దృష్టికి వివాదం

    |

    సినిమా పరిశ్రమలో సృజనాత్మకతను ఎక్కువగా చూపించబోయే ఇబ్బందుల్లో పడటం సాధారణంగా కనిపిస్తుంటుంది. తాజాగా కాళీ అనే సినిమా విషయంలో దర్శకురాలు లీనా మణిమేకలాయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఈ సినిమా యూనిట్‌పై రాజకీయ ప్రముఖులు, సినీ విమర్శకులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

     వివాదంలో కాళీ డాక్యుమెంటరీ

    వివాదంలో కాళీ డాక్యుమెంటరీ


    కాళి అనే డాక్యుమెంటరీ మూవీని లీనా మణి మేకలై అనే దర్శకురాలు రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్‌లో కాళీ మాత వేషధారి సిగరెట్ తాగుతూ కనిపించింది. మంచిగా దమ్ముకొడుతూ తన్మయత్వంతో ధూమపానాన్ని ఆస్వాదిస్తున్నట్టు కనిపించింది.

    దర్శకురాలు లీనా సోషల్ మీడియాలో

    దర్శకురాలు లీనా సోషల్ మీడియాలో


    కాళీ మాత పోస్టర్‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తూ.. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో కాళీ డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆవిష్కరించడం చాలా థ్రిల్లింగ్‌గా, ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ డాక్యుమెంటరీని మీ ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని లీనా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    భగ్గుమన్న కాళీమాత భక్తులు


    అయితే సోషల్ మీడియాలోకి కాళీ మూవీ పోస్టర్ విడుదల చేయగానే కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. కాళీమాత భక్తులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఏమిటీ ఈ వైపరీత్యం అంటూ దర్శకురాలిపై ఒంటికాలిపై లేచారు. భక్తుల మనోభావాలను దారుణంగా కించపరిచిందనే ఆరోపణలు సంధించారు. హిందు దేవతలు, దేవుళ్లంటే సినీ ప్రముఖులకు లెక్కలేదా అంటూ ప్రశ్నించారు.

    లీనాను అరెస్ట్ చేయండి అంటూ

    లీనాను అరెస్ట్ చేయండి అంటూ


    కాళీ డాక్యుమెంటరీ పోస్టర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేనియెడల దర్శకురాలు లీనా మణిమేకలైను అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేశారు. దర్శకురాలు లీనాపై తీవ్రంగా మండిపడటంతో సోషల్ మీడియాలో కాళీ మూవీ, లీనా ట్రెండింగ్‌లోకి వచ్చారు.

    ప్రధాని దృష్టికి కాళీ మాత పోస్టర్ వివాదం

    ప్రధాని దృష్టికి కాళీ మాత పోస్టర్ వివాదం


    లీనా మణిమేకలై వ్యవహారాన్ని నెటిజన్లు ప్రధాని, అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. ఈ దర్శకురాలిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి.ఎందుకంటే హిందూ దేవత మహంకాళిని దారుణంగా అవమానించారు అని ఓ నెటిజన్ అంటే.. హిందువుల సహనాన్ని సినీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా అని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

    English summary
    Kaali documentary poster goes contraversy, Director Leena Manimekalai in trouble. Leena Manikalai tweeted that Super thrilled to share the launch of my recent film - today at AgaKhanMuseum as part of its “Rhythms of Canada”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X