'మంచి సబ్జెక్టు, ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం'
Recommended Video

"The Prank" Motion Poster launch : Director Mahesh Kodi Speech
శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ సంస్థలో కొత్త చిత్రం డిజిటల్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసారు ఈ సందర్భంగా మహానుభావుడు సినిమాతో మరో హిట్ కొట్టిన దర్శకుడు మారుతీ, పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు.
ఫ్రాంక్ సినిమా దర్శకుడు మహేష్ కోడి మాట్లాడుతూ డైరెక్టర్లు మారుతి, రాజ్ కందుకూరిలు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మంచి సబ్జెక్టు కావడంతో ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నామని అన్నారు.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశామని అన్నారు. ఇంకా గోవా, బెంగుళూరు, హైదరాబాద్, సింగపూర్‌లో షూటిగ్ చెయ్యాల్సి ఉందని అన్నారు. ఈ సినిమా హిందీలో కూడా చెయ్యటం సంతోషంగా ఉందని అన్నారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలో చెప్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











