సమంతాను హర్ట్ చేసిన ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం..?!
సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం హీరోయిన్ వేటలో ఉన్నట్టు మనకు తెలుసు. హీరో కార్తీక్ కుమారుడు గౌతం సరసన నటింప చేయబోయేటందుకు ఈ గాలింపు జరుపుతున్నారు. మణిరత్నంకు కార్తిక్ తో ప్రత్యేకానుబంధం ఉంది. గతంలో మణి 'ఘర్షణ", 'మౌన రాగం" తదితర చిత్రాల్లో కార్తీక్ తో కలసి పనిచేసారు. ఈ రాబోయే చిత్రానికి సంగీతం, ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ అందిస్తారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాకపోవటం మణికి కాస్త ఇబ్బందిగా పరిణమించింది.
సూటబుల్ హీరోయిన్ కోసం అన్వేషిస్తోన్న తరుణంలో మణి ఫ్రెండ్స్ లో ఒకరు సమంతా ను సిఫార్సు చేసినట్టు తెలిసింది. కాగా, సమంతా పంపించిన ఫొటోస్ ను ఆయన పరిశీలించారు. వీటిలో ఆమె తాజా బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు సినిమాలోని క్లిప్పింగులు కూడా ఉన్నాయి. అయితే, ఇవి మణి దృష్టిని ఆకర్షించ లేదని తెలిసింది. వీటిని మణి సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మణి 'నో" తో సమంతా హర్ట్ అయినట్టు వినికిడి. మణిరత్నం ప్రాజక్టుతో ఈ ఏడాదిని దిగ్విజయంగా పూర్తి చేయాలను కున్న సమంతా కు ఈ వార్త నిరాశను మిగిల్చిందని సమాచరం.
కాగా వరుస హిట్లతో మంచి జోరుమీదున్న చెన్నయ్ సుందరి సమంతా తొలిసారిగా రామ్ చరణ్ పక్కన కథానాయికగా నటించనుంది. వీరిద్దరూ కలిసి దిల్ రాజు నిర్మించే భారీ చిత్రంలో జంటగా నటిస్తారు. ఆమధ్య 'బృందావనం' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి దీనికి దర్శకత్వం వహిస్తాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయింది. కాగా, ఈ చిత్రానికి 'వాడే' అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











