నంది అవార్డు రచయిత మనోహర్ కొత్త చిత్రం!

By Bojja Kumar

హైదరాబాద్: నంది అవార్డు రచయిత, గతంలో 'కల', 'అలా', 'వెల కమ్' చిత్రాలు రూపొందించిన చిమ్మని మనోహర్ దర్శకత్వంలో త్వరలో ఓ కొత్త కామెడీ రొమాంటిక్ హార్రర్ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో 'తీయని కలవో' ఫేమ్ అఖిల కార్తీక్ హీరోగా నటిస్తుండగా, ప్రముఖ హీరోయిన్ అతనికి జంటగా నటించనుంది.

'కాల్ సెంటర్' ఫేమ్ గౌతమ్ ఈ చిత్రంలోని ఒక ప్రధాన పాత్రలో నటించనున్నారు. చిత్రంలోని ఇతర పాత్రలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఒక ఐటమ్ సాంగ్ తో సహా మొత్తం మూడు పాటలు ఉంటాయి. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం అవుతుంది.

Director Manohar new movie details

కథ డిమాండ్ మేరకు, ఈ చిత్రంలోని కొంత భాగాన్ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ జనరేషన్ యువతని బాగా ఆకట్టుకునే కథ, కథనం, పాటలు, అద్భుతమైన లొకేషన్స‌లో చిత్రీకరణ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. అరుణ్ కుమార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ ఛాయా గ్రాహకుడు వీరేంద్ర లలిత్ పని చేస్తున్నారు.

కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ..
ఈ సినిమాలో ఇద్దరు కొత్త హీరోయిన్స్‌ను తీసుకోవాలనుకుంటున్నాం. వయసు 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కామన్ క్వాలిఫికేషన్లతో పాటు సినిమాల మీద, నటన మీద ఆసక్తి, హీరోయిన్ అవ్వాలన్న ప్యాషన్ చాలా అవసరం. ఇదొక కామెడీ రొమాంటిక్ హారర్ చిత్రం. పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా. ఆసక్తి ఉన్న వారు మీ ఫోన్ నెంబర్ తో పాటు ఫోటోలను [email protected] ఈమెయిల్ చెయ్యండి. పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. 'మా పేరెంట్స్ అనుమతితోనే నేను ఈ మెయిల్ పంపిస్తున్నాను' అని స్పష్టంగా మీ మెయిల్లో ఉండాలి. ఉంటే వీడియో క్లిప్స్ లింక్స్ కూడా పంపించండి. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ చివరి వారం నుంచి ఒకే షెడ్యూల్లో పూర్తవుతుంది అని దర్శకుడు మనోహర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X