‘అత్తారింటికి దారేది’ కోసం మారుతి ఇలా...(ఫోటో)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ రోజు విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు, నిర్మాత మారుతి.....తన వంతు బాధ్యతగా యాంటీ పైరసీ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాడు. ఈ మేరకు ఓ బహిరంగ ప్రకటన విడుదల చేసారు.
పైరసీకి పాల్పడిన వారిపై మారుతి విరుచుకుపడ్డారు. కన్నతల్లిని కూడా అమ్ముకునే అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. అదే విధంగా పైరసీ నీడ అత్తారింటికి దారేది సినిమాపై పడకుండా చూడాల్సిన బాధ్యత సగటు ప్రేక్షకుడిపై ఉందని, పైరసీని ప్రొత్సహించవద్దని, సినిమాను థియేటర్లలోనే చూడాలని కోరారు.
కాగా....ఈ చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజవుతోంది. వాస్తవానికి ఈచిత్రం అక్టోబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నిన్న ఈ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అవడంతో....త్వరగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.
పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












