ఆ వార్తలన్నీ అవాస్తం, ఇది మాత్రమే నిజం.. మారుతి క్లారిటీ
యంగ్ డైరెక్టర్ మారుతి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మొదట్లో అడల్డ్ కంటెంట్ సినిమాలతో ముందుకు వచ్చిన మారుతి.. రానురాను తన పంథాను మార్చుకున్నాడు. ఈరోజుల్లో, బస్టాప్ వంటి చిత్రాలతో దూసుకొచ్చిన మారుతి.. అదే స్థాయిలో విమర్శలు అందుకున్నాడు. అయితే ప్రేమకథా చిత్రమ్, భలె భలె మగాడివోయ్ వంటి చిత్రాల తరువాత కంప్లీట్‌గా తన ట్రాక్ మార్చేసుకున్నాడు.
ఇప్పుడు మారుతి చిత్రాలంటే హాస్య భరిత చిత్రాలన్న ఫీలింగ్ ఏర్పడింది. తాజాగా వచ్చిన ప్రతిరోజూ పండగే వంటి చిత్రంతో క్లాస్ ఆడియెన్స్, ఫ్యామిలీ సెక్షన్లకు కూడా దగ్గరయ్యాడు. అయితే మారుతి చేయబోయే తదుపరి చిత్రంపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ కోసం ఓ చిత్రం చేయమని చిరు అడిగితే కూడా నో చెప్పాడని, ఓ స్టార్ హీరో కోసం కథను సిద్దం చేశాడని టాక్ వినిపించింది.

ఇలాంటి రూమర్లపై మారుతి తాజాగా స్పందించాడు. తన స్టైల్లో సమాధానమిచ్చి రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు. 'నా తదుపరి చిత్రాలపై వస్తున్న వార్తలను కొన్ని మీడియా సెక్షన్లలో చూశాను. మీకున్న ఆసక్తికి ధన్యవాదాలు. అయితే నేను ఇంకా స్క్రిప్ట్ పనిలోనే ఉన్నాను.. ఇంకాస్త సమయం పడుతుంది పూర్తవ్వడానికి.. పూర్తయ్యాక నేనే మీకు చెబుతాను.. ఇదే వార్త.. మిగతావన్ని రూమర్సే.. థ్యాంక్యూ మీడియా మిత్రులారా' అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











