Prabhas ఆ పనిలో ముందుంటారు.. అందుకే ఆయనంటే నాకిష్టం: డైరెక్టర్ కూతురు షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్... త్వరలో సలార్, ప్రాజెక్టు కే సినిమాలతో అలరించనున్నారు. ఇక దర్శకుడు మారుతితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉండగా.. మారుతి కుమార్తె హియా.. ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రభాస్ సినిమా అప్డేట్స్ అయినా.. ప్రభాస్ విషయాలు ఏవైనా... ఫ్యాన్స్ మాత్రం వేల కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్, ప్రాజెక్టు కే సినిమాలతో పాటు.. మారుతి దర్శకత్వంలో ఓసినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్లుగానే... ఆ సినిమా ఫోటోస్ కూడా లీక్ అవుతూ వచ్చాయి.

మొన్న బేబీ ఈవెంటులో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేసే స్థాయికి వచ్చాను అంటూ మారుతి హింట్లు వదిలారు. ఇక మారుతి ప్రభాస్ మూవీ కన్మర్మ్ అయినట్లే అనుకున్నారు అంతా. ఇక మారుతి ప్రభాస్ మూవీ పిక్ కూడా లీక్ అయి.. వైరల్ గా మారింది. దీనతో సినిమా ఉంటుందని అర్థం అయింది. ఇక ఈ సినిమాకు రాజా డిలాక్స్, రాయల్ అనే పేర్లు కూడా వినిపించాయి.
ప్రభాస్ మారుతి సినిమా అధికారికంగా ప్రకటించకపోయినా.. షూటింగ్ మాత్రం జరుపుకుంటుందని టాక్. తాజాగా మారుతి డాటర్ హియా దాసరి.. ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె ఓ మంచి పెయింటర్. హియా ఆర్ట్ గ్యాలరీలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ఈ సందర్భంగా హియా మాట్లాడుతూ ప్రభాస్ గురించి చెప్పింది.

హియా మాట్లాడుతూ... ప్రభాస్ ఎంతో మంచివాడు. ఎంతో హుందాగా, గర్వం లేకుండా ఉంటాడు. ఎంతో వినయంగా ఉంటాడు. ఆయన్నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ప్రభాస్‌కి ఫుడ్ అంటే ఇష్టం. నాకు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంతే కాదు ప్రభాస్ అందరికీ ప్రేమగా ఫుడ్ పెడతారు. ఎదుటివాళ్లకి సాయం చేసేందుకు ముందుంటారు.. ఆయనే నాకు స్పూర్తి .. అంటూ మారుతి కుమార్తె హియ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఇక మారుతి ప్రభాస్ చిత్రానికి వస్తే.. ఈ సినిమా సైలెంటుగా షూటింగ్ జరుపుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సూపర్ నేచురల్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా నుంచి లీకైన ఫోటోల్లో ప్రభాస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరింత అంఛనాలను పెంచేశాయి.


Click it and Unblock the Notifications











