Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
చైతూనే యువ సామ్రాట్.. నేను గ్యారంటీ ఇస్తున్నా.. మారుతి
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ''అక్కినేని అభిమానులు కోరుకున్నట్లు నాగచైతన్య తెరపై కనపడతారు. వారిచ్చిన ఎనర్జీతోనే సినిమాను చక్కగా చేశాను. ఈ సినిమా నుంచి ఆయన యువ సామ్రాట్. నేను ట్యాగ్ వేస్తున్నాను. శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్ చూసి 80-90లో చూసిన అత్త, అల్లుడు మధ్య నడిచే పోట్లాట, చాలెంజింగ్ సినిమా కథ కాదు. మంచి లవ్‌స్టోరి.
శైలజారెడ్డి చిత్రానికి ఎంటర్టైన్మెంట్ ఎంత యాడ్ చేయాలో అంత చేశాం. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంటర్టైనింగ్గా రావడానికి ఎంతో సపోర్ట్ చేశారు. నిజార్షఫీగారు మంచి విజువల్స్ ఇచ్చారు. గోపీసుందర్‌గారు చాలా కష్టపడి క్వాలిటీ తగ్గకుండా సినిమాకు పాటలు, రీరికార్డింగ్ ఇచ్చారు అని మారుతి అన్నారు.
రమ్యకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమెతో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆమెతో శైలాజరెడ్డిగా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అను ఇమ్మాన్యుయేల్ తన పాత్రకు న్యాయం చేసింది. నాకు ఒక యాక్టర్‌గా అయినా.. హీరోగా పరిచయం అయినా.. చైతన్య క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాతో సంబంధం లేకుండా మా జర్నీ సాగింది అని అన్నారు.
వినాయక చవితికి, ఈనెల 13న సినిమా విడుదలవుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత రాధాకృష్ణగారు, నాగవంశీగారు, పి.డి.వి.ప్రసాద్‌గారికి థాంక్స్. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.