వెంకటేష్‌ను అవమానించిన నయనతార.. స్టార్ డైరెక్టర్ ఏం చేశారో తెలుసా?
బడా హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ మూవీలు తెలుగు తెరను దున్నేస్తోన్న సమయంలో చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్ధకమైంది. పెద్ద సినిమాలు వస్తే చిన్న సినిమాలను లేపేయాల్సిందే, మంచి సీజన్‌లో రిలీజ్ చేద్దామనుకున్నా థియేటర్లు దొరకని పరిస్ధితి. అలాంటి పరిస్ధితుల్లో చిన్న సినిమాను నిలబెట్టారు దర్శకుడు మారుతి. ఇండస్ట్రీలోకి రావడానికి ముందు కేవలం పోస్టర్స్ డిజైనింగ్, మల్టీమీడియాలో పనిచేసిన ఆయనకు సినిమా దర్శకత్వ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు. కాకపోతే.. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా .. ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలను డైరెక్ట్ చేశారు.
కానీ గుండె ధైర్యం, కృషి, పట్టుదలతోనే ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీ ఈరోజుల్లో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే అది బోల్డ్ కంటెంట్ కావడంతో మారుతిని విమర్శలు చుట్టుముట్టాయి. ఈ వెంటనే ప్రేమకథా చిత్రంతో మరో హిట్ అందుకున్న మారుతి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత భలేభలే మగాడివోయ్ సినిమాతో మారుతి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ వెంటనే అగ్ర కథానాయకుడు వెంకీ మామతో బాబు బంగారం, శర్వానంద్‌తో మహానుభావుడు, సాయిధరమ్ తేజ్‌తో ప్రతిరోజూ పండగే వంటి సినిమాలు తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

కేవలం దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగానూ మారుతి రాణించారు. యువతకు నచ్చే అంశాలను సినిమాలో చొప్పించి.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ రోజుల్లో సినిమాకి ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం కాస్తంత వెనుకబడిన మారుతి తన నెక్ట్స్ మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేస్తున్నారు. అదే ది రాజా సాబ్.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం మాస్ చిత్రాలు, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్‌గా మారిపోయిన ప్రభాస్‌ను పూర్తిగా మేకోవర్ చేసి పాత డార్లింగ్‌ను గుర్తుచేస్తానని మారుతి అంటున్నారు. 2025 సంక్రాంతి లేదా సమ్మర్‌కి రాజా సాబ్ రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి తన సినిమాలు, తన ప్రపంచంలో బతకడమే తప్పించి వేరే విషయాలను పట్టించుకోరు మారుతి. అలాంటి వ్యక్తికి ఓ హీరోయిన్‌తో గొడవ జరిగిందట. అది ఎవరో కాదు.. లేడీ సూపర్‌స్టార్ నయనతారతో. ఈ విషయాన్ని స్వయంగా మారుతి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నయనతార బాబు బంగారం చిత్ర యూనిట్‌కు సహకరించేది కాదన్నారు. తాను చిన్న దర్శకుడినని.. తనను గౌరవించకపోయినా పర్లేదు కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని గౌరవించకుండా దారుణంగా ప్రవర్తించేదని మారుతి గుర్తుచేశారు. వెంకటేష్‌ను నయన్ కొన్నిసార్లు లెక్కచేయకపోవడంతో ఇక ఉండబట్టలేక ఆమెతో గొడవ పెట్టుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
బాబు బంగారం మూవీ క్లైమాక్స్‌లో ఓ పాట చిత్రీకరించాల్సి ఉందని, కానీ నయనతారను ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె ఒప్పుకోలేదన్నారు. తాను డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని.. వేరే చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పిందని మారుతి తెలిపారు. వెంకటేష్ లాంటి స్టార్ ఇందులో హీరో అనే గౌరవాన్ని కూడా ఆమె చూపించలేదని.. ఆ విషయంలో నాకు ఎంతో బాధగా అనిపించి నయనతారతో గొడవ పెట్టుకున్నానని మారుతి గుర్తుచేసుకున్నారు. చివరికి పాట చేయకుండానే బాబు బంగారం సినిమాను రిలీజ్ చేశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మారుతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











