Mangalavaaram వంశీని మరిపించిన అజయ్ భూపతి.. మంగళవారం మూవీని అన్వేషణతో పోల్చుతూ..
తెలుగు సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లను, ఫార్మూలాను, మూస, రొడ్డకొట్టుడు స్టోరీలను నమ్ముకోవడం కంటే.. కథలను, కంటెంట్‌ను నమ్ముకొని తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విశ్వనాథ్, వంశీ, కృష్ణ వంశీ లాంటి కొందరు మాత్రమే తెలుగు నేటివిటిని, సంప్రదాయాలు, ఆచారాలను నమ్మకొని సినిమాలు రూపొందించడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు.
నేటితరం దర్శకుల్లో అలాంటి కోవలోకి వచ్చే వారిలో దర్శకుడు అజయ్ భూపతి ఒకరంటే ఎలాంటి సందేహం ఏ మాత్రం అక్కర్లేదని చెప్పవచ్చు. అయితే తాజాగా అజయ్ భూపతి నిర్మించిన మంగళవారం చిత్రం సాధారణ ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను, విమర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. అజయ్ భూపతి రూపొందించిన మంగళవారం సినిమా వివరాల్లోకి వెళితే..

అజయ్ భూపతి విషయానికి వస్తే.. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా RX100 మూవీతో దర్శకుడిగా మారారు. తెలుగు నేటివిటితో ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను తీర్చి దిద్దారు. ఆ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకులు బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

దర్శకుడిగా అజయ్ భూపతిది ప్రత్యేకమైన శైలి. కొత్త జోనర్స్‌ను సృష్టించడానికి పరితపిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్‌కు బలమైన పాత్రలను రాయడంలో ఎప్పడూ ముందుంటారు. ఆయన తీసిన మూడు చిత్రాల్లో కూడా హీరోయిన్ పాత్ర చాలా బలంగా కనిపించింది. RX100, మహా సముద్రం లాంటి సినిమాల్లో కథానాయికకే అగ్ర తాంబూలం వేశారు.

ఇక తాజా చిత్రంలో ఇండియాలో ఎవరూ టచ్ చేయనటువంటి పాయింట్‌తో మంగళవారం సినిమాను హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా మలిచారు. తెలుగు నేటివిటి ప్రతిబించే వాతావరణం, పాత్రల చిత్రీకరణతోపాటు కథానాయకుడి పాత్ర లేకుండా కథనే హీరోగా మలిచి మంగళవారం సినిమాను రూపొందించారు. మానసిక సంఘర్షణ, భావోద్వేగాలతో సాగే పాయల్ రాజ్‌పుత్ పాత్ర ప్రేక్షకుడి హృదయాన్ని ఊగిసలాటకు గురిచేసేలా సినిమాను రూపొందించారు.


మంగళవారం సినిమా విషయానికి వస్తే.. లైంగిక మానసిక రుగ్మతకు గురైన యువతి పాత్ర చుట్టు అల్లుకొన్న కథలో కామెడీ, ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే క్యారెక్టరతో మ్యాజిక్ చేశారు. వంశీ తరహా అనుభూతిని కలిగించే సినిమాను రూపొందించారు. వినోదం, భావోద్వేగంతో కూడిన సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది. దర్శకుడు వంశీని మరిపించేలా ఈ సినిమాను తెరకెక్కించారంటూ.. అన్వేషణ సినిమాతో మంగళవారం మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంటి ప్రముఖులు పోల్చుతుండటం గమనార్హం.
ఇటీవల టాలీవుడ్ దర్శకులకు మంగళవారం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. మంగళవారం సినిమా మామూలుగా లేదు. ఫస్ట్ ప్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. నిజంగా అజయ్ భూపతి కసితో తీసిన సినిమా ఇది. తప్పకుండా థియేటర్‌లోనే చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయండి. కొత్త జోనర్ ఓపెన్ చేశారు. సినిమా చాలా బావుంది. నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను అని మారుతి అన్నారు.


Click it and Unblock the Notifications











