Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
హాలీవుడ్ టెక్నీషియన్‌ను ఫిదా చేసిన మారుతి కుమార్తె.. పుత్రికోత్సాహంలో డైరెక్టర్
దర్శకుడు మారుతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మారుతి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించాడు. మొదట్లో అడల్ట్ చిత్రాలను తెరకెక్కిస్తూ విమర్శలు మూటగట్టుకున్నా.. తదుపరి కాలంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి చిత్రాలతో ఆరోగ్యవంతమైన కామెడీని సృష్టించాడు.
రీసెంట్గా వచ్చిన ప్రతీ రోజు పండగే చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో మారుతి కూతురు హియా కూడా నటించింది. రాశీ ఖన్నా చెల్లెలి గ్యాంగ్‌లో ఉంటుంది. ఓ బావా అనే పాటలో అద్భుతంగా నర్తించి అందర్నీ ఆకట్టుకుంది. మారుతి ప్రస్తుతం పుత్రికోత్సాహంలో ఉన్నాడు. కూతురులోని భిన్న ప్రతిభలను చూసి తండ్రి మురిసిపోతున్నాడు. ఆమె ప్రతిభను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ తెలిసేలా చేస్తున్నాడు.
మారుతి కూతురు హియ.. కేవలం ఫోన్ లైట్లో క్లిక్ చేసిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూస్తే నిజంగానే ఓ ప్రొఫెషనలిస్ట్ తీసిన మాదిరిగా ఉన్నాయి. ఆ ఫోటోలను హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ డాన్ లాస్టెన్ లైక్ చేసేశాడు. ఇక ఇంకేముంది పరీక్షలు రాయకుండానే పీహెచ్డీ పట్టా పొందిన కుమార్తెను చూసి మారుతి మురిసిపోతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిని డీఓపీ.. ది షేప్ ఆఫ్ వాటర్, ది లీగ్ ఆఫ్ ఎక్స్ట్రార్డినరీ జెంటిల్మెన్, జాన్ విక్ సిరీస్‌ల సృష్టి కర్తే.. తన కూతురు తీసిన ఫోటోలను మెచ్చాడని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.