twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంత రిక్వస్ట్ చేసినా నయనతార ఒప్పుకోలేదు.. అందుకే గొడవ, నడుము కూడా చూపించను!

    |

    Recommended Video

    Director Maruthi Responds On Issue With Nayantara

    దర్శకుడు మారుతి ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాలతో మారుతి టాలీవుడ్ లో దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అయన చిత్రాలు అద్భుతమైన వినోదాన్ని అందించేవిగా ఉంటాయి. టాలీవుడ్ లో మారుతి మినిమమ్ గ్యారెంటీ దర్శకుడనే అభిప్రాయం ఏర్పడింది. మారుతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి, సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

    ఎంత రిక్వస్ట్ చేసినా

    ఎంత రిక్వస్ట్ చేసినా

    బాబు బంగారం చిత్రంలో క్లైమాక్స్ లో ఇంకొక పాట చిత్రికరించాల్సి ఉంది. కానీ నయనతార ఒప్పుకోకపోవడంతో ఆ సాంగ్ చిత్రీకరించకుండానే సినిమా విడుదల చేశాం అని మారుతి అన్నారు. ఎంత రిక్వస్ చేసినా నయనతార ఒప్పుకోలేదు. నాకు డేట్స్ లేవు. వేరే చిత్రాలతో బిజీగా ఉన్నా. నేను చేయను అంటూ చెప్పేశారు.

    అందుకే గొడవ

    అందుకే గొడవ

    కనీసం ఇది వెంకటేష్ లాంటి స్టార్ హీరో సినిమా అనే గౌరవాన్ని కూడా ఆమె ప్రదర్శించలేదు. నిర్మాతలు చాలా రిక్వస్ట్ చేశారు. నేను చేయను. ఇక మీ ఇష్టం అని తేల్చేశారు. ఆ విషయంలో నాకు చాలా బాధేసిందని మారుతి తెలిపాడు. ఆ విషయంలోనే నయనతారతో వివాదం చోటు చేసుకుందని తెలిపాడు.

    ఈ రోజుల్లో, బస్టాప్‌పై విమర్శలు

    ఈ రోజుల్లో, బస్టాప్‌పై విమర్శలు

    ఈ రోజుల్లో,బస్టాప్ చిత్రాలపై వచ్చిన విమర్శల గురించి మారుతి స్పందించాడు. బయట యువత మొబైల్ ఫోన్స్, లాప్ టాప్స్ ని దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ఆ చిత్రాల్లో ఘాటుగా చూపించా. అందువలన కొంతమందికి ఆ చిత్రాలు నచ్చకపోయి ఉండవచ్చు అని మారుతి తెలిపాడు.

    తల్లిదండ్రుల కోసమే

    తల్లిదండ్రుల కోసమే

    బస్టాప్, ఈ రోజుల్లో చిత్రాలతో పరోక్షంగా తాను తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చానని తెలిపాడు. తమ పిల్లలకు మొబైల్, లాప్ టాప్ వంటి అన్ని సౌకర్యాలని తల్లి దండ్రులు సమకూరుస్తారు. వాటిని పిల్లలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. ఆ విషయం వారికీ తెలియజేయాలి అంటే కొన్ని సన్నివేశాలు ఘాటుగానే చూపించాలి అని మారుతి అభిప్రాయపడ్డారు.

    నడుము కూడా చూపించలేదు

    నడుము కూడా చూపించలేదు

    ఎక్స్ ఫోజింగ్ ని వ్యతిరేకించే వారిలో తాను మొదటి వ్యక్తిని. రోజుల్లో, బస్టాప్ వంటి చిత్రాల్లో కూడా నేను ఎక్కడా హీరోయిన్ నడుము కూడా చూపించలేదు. ఎక్స్ ఫోజింగ్ చేయిస్తే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారనేది భ్రమ అని మారుతి తెలిపాడు.

    ఒక్కో చిత్రంలో ఒక్కో సందేశం

    ఒక్కో చిత్రంలో ఒక్కో సందేశం

    తన చిత్రాలని గమనిస్తే అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుందని మారుతి తెలిపాడు. చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకోకూడదని ప్రేమ కథా చిత్రంలో, స్వార్థం ఉంటే వచ్చే ఇబ్బందులని కొత్త జంట చిత్రంలోచూపించానని మారుతి తెలిపాడు. భలే భలే మగాడివోయ్ చిత్రంలో లోపం ఉన్న వ్యక్తిని ప్రేమించ వచ్చు అనే సందేశాన్ని ఇచ్చానని మారుతి వెల్లడించాడు.

    English summary
    Director Maruthi Responds On Clash with Nayantara. Maruthi About Exhibiting Heroines In His Movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X