లిప్‌లాక్ సీన్లపై మారుతి షాకింగ్ కామెంట్.. అలాగైతే 70 కోట్లు వస్తాయా?

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీక ష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మించిన చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌'. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌, పంతం వంటి చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ 'భలే మంచి చౌక బేరమ్‌' చిత్రాన్ని సమర్పించడం విశేషం. అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు దర్శకుడు మారుతి కాన్సెప్ట్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో మారుతి మీడియాతో మాట్లాడారు.

 కాన్పెప్ట్‌తో రూపొందిన సినిమా

కాన్పెప్ట్‌తో రూపొందిన సినిమా

భలే మంచి చౌక బేరం సినిమా అరోళ్ల గ్రూప్ బ్యానర్‌పై విడుదల అవుతున్నది. ఇది కాన్సెప్ట్ సినిమా. సాధారణంగా చిన్న సినిమాల కాన్సెప్ట్ బాగుంటాయి. కానీ ప్రేక్షకులు థియేటర్‌కు రారు. కానీ ఈ చిత్ర కథ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించిన అంశం గ్రిప్పింగ్‌గా ఉంటుంది.

ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచదు

ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచదు

ఓ ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమాకు సినీ వర్గాల నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ప్రేక్షకుడిని నిరుత్సాహానికి గురిచేయదు. నా సినిమాలను ఆదరించినట్టే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది.

Recommended Video

Director Maruthi Responds On Issue With Nayantara
యాక్షన్‌తోపాటు వినోదం

యాక్షన్‌తోపాటు వినోదం

భలే మంచి చౌకబేరం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు యాక్షన్ కూడా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి చాలా ఫన్నీగా ఉంటుంది. కామెడీ చిత్రాలు కూడా యూత్ సినిమాలే. శైలజారెడ్డి సినిమాను లేడీస్, యూత్‌ను టార్గెట్ చేసి తీశాను.

లిప్‌లాక్స్ కోసం ఎవరూ రారు

లిప్‌లాక్స్ కోసం ఎవరూ రారు

పూర్తిగా లిప్‌లాక్‌లతో సినిమా తీస్తే సక్సెస్ అవుతుందనుకొంటే పొరపాటే. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి మొబైల్లో అలాంటి వీడియోలు చాలానే ఉంటాయి. లిప్‌లాక్ కోసం సినిమాకు ఎవరూ రారు. అలా వస్తే 70 సీన్లు ఉంటే 70 లిప్‌లాక్‌లు పెడితే 70 కోట్లు వస్తాయనుకోవడం పొరపాటు.

కథలో భాగమైతేనే లిప్‌లాక్స్‌కు ఆదరణ

కథలో భాగమైతేనే లిప్‌లాక్స్‌కు ఆదరణ

కంటెంట్‌లో లిప్‌లాక్‌లు భాగమై.. ప్రేక్షకుడు స్వయంగా ఆ పాత్రను తనకు తానుగా భావిస్తే తాను స్వయంగా లిప్‌లాక్ పెట్టుకొంటున్నట్టు ఫీలవుతాడు. అప్పుడే ఆ సినిమాకు ఆదరణ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X