గీతా ఆర్ట్స్ బేనర్లో మారుతి చిత్రం
మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్టాఫ్ సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాలో కాస్త బూతు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ తరం యువత చెడుదారులు పడతున్న వైనాన్ని, తల్లిదండ్రుల తీరును తనదైన రీతిలో చూపించాడు దర్శకుడు మారుతి.
లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై మల్టీ డైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు 'బస్ స్టాప్' చిత్రాన్ని నిర్మించారు. యువతకు సందేశమిచ్చే ఈ చిత్రం తల్లిదండ్రుల పక్షపాతిగా దర్శకుడు తెరకెక్కించారని చెప్పొచ్చు.
బస్ స్టాఫ్ చిత్రం కొన్ని వివాదాలకు కూడా దారితీసింది. దేనికైనారెడీ, ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాల గొడవ సద్దుమణగకముందే " బస్ స్టాప్" సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆదివారం విడుదలైన " బస్ స్టాప్" సినిమాలో విపరీతమైన ద్వంద్వార్థాలు ఉన్నాయని, ఈ సినిమా విద్యార్థులు, యువతను పక్కదారి పట్టించేలా ఉందంటూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాలు ఆందోళనకు దిగాయి.


Click it and Unblock the Notifications












