Raja Saab ప్రభాస్ రాజాసాబ్ స్టోరీ లీక్.. దిమ్మతిరిగేలా షాకిచ్చిన డైరెక్టర్ మారుతి!

రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్, పోస్టర్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీనీ ఐఎండీబీ లీక్ చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి షాకింగ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మారుతి రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజిబిజిగా ఉన్నాడు. ఇప్పటికే సలార్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో... మరో రెండు చిత్రాలు రెడీ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి ఏడి 2898 చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక మరో చిత్రం మారుతి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్, పోస్టర్ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది.

Director Maruti Reaction On Prabhas Raja Saab Movie Story Leak In IMDb Full Details Here

ఇక ఈ సినిమలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. పోస్టర్ చూస్తే.. ప్రభాస్ లుక్ కూడా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది కానీ ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఇక సినిమా నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్.

ఈ సినిమా స్టోరీ గురించి పలు మార్లు లీక్స్ వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ జాతకాలు చెబుతాడని, ప్రభాస్ ఒక పెద్ద బంగ్లాలో ఉంటాడని అంటూ చాలా స్టోరీస్ లీక్స్ వచ్చాయి. ఇక మొదట ఈ సినిమా పేరు రాజా డీలక్స్ అని ప్రచారం జరిగింది. కానీ చివరకు సినిమాకి టైటిల్ రాజా సాబ్ ఫిక్స్ చేసి మేకర్స్ షాక్ ఇచ్చారు.

Director Maruti Reaction On Prabhas Raja Saab Movie Story Leak In IMDb Full Details Here

అయితే రాజా సాబ్ సినిమా స్టోరీని ప్రముఖ ఇండియన్ మూవీ డేటా బేస్ వెబ్ సైట్ లీక్ చేసింది. రాజా సాబ్ స్టోరీ ప్లాట్ తన వెబ్ సైట్ లో రాసుకువచ్చింది. అందులో ఏముందంటే... ఒక జంట మధ్య జరుగుతుందని ప్రేమలో పడిన వారు పెళ్లి చేసుకోకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ వారిని ఇబ్బంది పెడుతుందని అందులో ఐఎండీబీ తెలిపింది. దీనిపై లుక్ వేసిన మారుతి... ఈ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఫన్నీగా స్పందించారు.

తన ట్విట్టర్ వేదికగా రాసుకువస్తూ... అరెరే నాకు ఈ సినిమా ప్లాట్ ఇలా ఉంటుందని తెలియదే. నాకు తెలియక వేరే స్క్రిప్ట్ తో షూటింగ్ చేసేస్తున్నాను అంటూ ఫన్నీగా రాసుకువచ్చాడు. అంతే కాదు... ఇప్పుడు ఈ ఐఎండీబీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా మరి అంటూ రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ ట్వీట్ మీద ప్రభాస్ అభిమానులు కూడా కామెంట్స్ పెడుతూ ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X