V సినిమా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసమేనా.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెల్లమెల్లగా మన స్టార్స్ అంచనాలకు మించి తోటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపిస్తే ఆ కిక్కు ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక V సినిమా వారితోనే చేయాల్సిందా? అనే సందేహాలకు ఆ సినిమా దర్శకుడు ఫైనల్ గా క్లారిటీ ఇచ్చాడు.

సినిమా ప్రమోషన్స్ జోరుగా..
టాలెంటెడ్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన V సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో సమ్మర్ లో థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు కరోనా వైరస్ కారణంగా డిజిటల్ వరల్డ్ లోనే విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ జోరుగా పాల్గొంటోంది.

V పవన్, మహేష్ కోసమేనా..
నాని, సుధీర్ బాబు ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొదట పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో చేయాల్సింది అనే రూమర్స్ గట్టిగానే వచ్చాయి. ఆ రూమర్ తో నిజంగా సినిమాపై ఎక్కువ ఫోకస్ పడింది. ఇక ఇటీవల దర్శకుడు. మోహన్ కృష్ణ ఆ విషయంపై వివరణ ఇచ్చారు..

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ఏదైనా ఒక సినిమాను మనం చూసినప్పుడు ఆ సినిమా వేరే హీరోలతో చేస్తే ఇంకా బావుంటుందని అనుకుంటాం. ఎన్టీఆర్, శోభన్ బాబుతో ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అలాగే వేరే స్టార్స్ తో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు రావడం చాలా సహజం. అదే తరహాలో V సినిమాలో ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు మహేష్, పవన్ కలిసి నటిస్తే కూడా అద్భుతంగా ఉంటుందని అనుకున్నాం.
Recommended Video

వారు తప్పితే మరొకరు న్యాయం చేయలేరు
కేవలం అదొక ఊహ మాత్రమే. అంతే గాని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకొని కథను రాసుకోలేదు. ఇక ఈ సినిమాకు ఎంత ఎక్కువగా ఆలోచించినా కూడా నా దృష్టిలో నాని, సుధీర్ బాబు తప్పితే మరొకరు న్యాయం చేయలేరు అని కచ్చితంగా చెప్పగలను. వారు ఇద్దరు కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు' అని మోహన్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











