మహేష్ భార్య నమ్రత వల్ల ఓ అమ్మాయి లైఫ్​ నాశనం.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్​!

ఏంటి ఈ టైటిల్ విని షాక్ అయ్యారా? నిజంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఏ అమ్మాయి లైఫ్​ను నాశనం చేసిందో అని అనుకుంటున్నారా? అసలు ఈ విషయం ఏ డైరెక్టర్ చెప్పాడో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? దాని గురించే ఈ కథనం. అసలేం జరిగిందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

వివరాల్లోకి వెళితే.. మహేశ్ బాబు నమ్రత జంట చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలా మంది భార్యభర్తలకు ఆదర్శంగా నిలిచారు. పెళ్లై ఇంతకాలమైన ఎటువంటి వివాదాలు లేకుండా, ఏ కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా లైఫ్​ను ఎంతో హ్యాపీగా, ఉన్నతంగా గడుపుతున్నారు. కేవలం తమ పిల్లల బాగోగులు, సినిమాలు, సామాజిక సేవ.. ఇదే వీరి పని.

Director Mohana Krishna Indraganti Says that Mahesh Babu Fan girl life was ruined by Namrata Shirodkar News Goes Viral

అయితే మహేశ్ నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటననే బయటపెట్టారు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. నాని హీరోగా వచ్చిన తొలి సినిమా అష్టా చమ్మా చిత్రానికి ఆయనే దర్శకుడిగా వ్యవహరించారు. ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆయన షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

అష్టా చమ్మ మూవీ చేసే సమయంలో మహేశ్​ బాబుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్​ చాలా ఎక్కువ. పైగా ఈ చిత్రంలో హీరోయిన్ స్వాతిది మహేశ్ అంటే ఎంతో పిచ్చిగా ప్రేమించే పాత్ర. అందుకే మూవీలో మహేశ్​ను గెస్ట్ రోల్​గా తీసుకురావాలి అనుకున్నాను. దీనికి సంబంధించి కొంత కథ కూడా రాసుకున్నాను. హీరోయిన్ స్వాతి పాత్ర కృష్ణ ఇంటి దగ్గరికి వెళ్లి మహేశ్​ బాబును కలవాలని అనుకుంటుంది. అప్పుడు కృష్ణ గారు వచ్చి మహేశ్​ రీసెంట్​గానే కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అతడు ఇప్పుడు బయటికి వస్తే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుంది అంటూ కృష్ణ డైలాగ్​ చెప్పేలా కథను రాశాను. కానీ కృష్ణ, మహేశ్​తో నటింపజేయడం కుదరలేదు.

Director Mohana Krishna Indraganti Says that Mahesh Babu Fan girl life was ruined by Namrata Shirodkar News Goes Viral

అలాగే మహేశ్​ బాబుకు పెళ్లైన సమయంలో అతడి పెళ్లి విషయం తెలిసి తిరుపతిలో ఆయన విరాభిమాని అయిన ఓ అమ్మాయి మానసిక స్థితి కోల్పోయింది. తన మానసిక స్థితి క్షీణించి పోయింది. అంటూ ఇంద్రగంటి షాకింగ్ కామెంట్స్​ను చేసినట్లు బయట కథనాల్లో రాసి ఉంది. ​ ఈ విషయం ఆ మధ్యలో బాగా వైరల్ అయింది. మహేస్​ బాబును నమ్రత పెళ్లి చేసుకోవడం వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనమయ్యిందా అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఈ వార్తలైతే బయట బాగా దర్శనమిచ్చాయి.

ఇక మహేశ్ బాబు రీసెంట్​గా గుంటూరు చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్​డ్​ టాక్​ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్స్​ వర్క్​ను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం మహేశ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X