ఇప్పటికే యూట్యూబ్‌లో అలా ఏసేస్తున్నారు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా డైరెక్టర్ కామెంట్స్
యాంకర్ ప్రదీప్ కాస్తా ఇప్పుడు హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఓ ఘటన జరిగింది. ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలోనే దర్శకుడు మున్నా స్టేజ్ మీద కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అలా ఈ ట్రైలర్ ఈవెంట్ మొత్తం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
30 Rojullo Preminchadam Ela Event Photos

అంతా దాని గురించే..
అయితే ట్రైలర్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాల్సింది పోయి.. దర్శకుడు కింద పడిపోయిన విషయం గురించి మాట్లాడుకున్నారు. కుప్పకూలిన డైరెక్టర్ అంటూ యూట్యూబ్‌లో వైరల్ అయింది. అలా దర్శకుడు, సినిమా మొత్తం సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.

తాజాగా అలా..
అయతే నిన్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు ప్రదీప్ బుల్లితెర ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. హైపర్ ఆది, శ్రీను, సుధీర్, రాం ప్రసాద్, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ వచ్చారు. మారుతి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు సైతం హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లోనూ దర్శకుడు కాస్త ఎమోషనల్ అయ్యాడు.

అందరి గురించి..
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి గురించి చెప్పుకొచ్చాడు. తన అమ్మకు సుమ అంటే చాలా ఇష్టమని, తనను చూసేందుకు ఈవెంట్‌కు వచ్చిందని మున్నా తెలిపాడు. ఇక సంగీత దర్శకుడు అనూప్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ లిప్సిక, డైరెక్టర్ మారుతి ఇలా అందరి గురించి పేరుపేరునా చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరి గురించి..
హీరో ప్రదీప్, హీరోయిన్ అమృతా అయ్యర్ గురించి దర్శకుడు స్పెషల్‌గా మాట్లాడాడు. ఈ ఇద్దరూ లేకపోతే ఈ సినిమానే లేదు.. ఎంతో అద్భుతంగా నటించారు... ఇంత కంటే ఎక్కువగా ఎమోషనల్ కాను.. ఇంకా ఎక్కువైతే మళ్లీ కుప్పకూలిన డైరెక్టర్ అని రాస్తారు..ఇప్పటికే యూట్యూబ్‌లో కుప్పకూలిన డైరెక్టర్ అని ఏసేసుకుంటున్నారు అని యూట్యూబ్ థంబ్ నెయిల్స్ మీద డైరెక్టర్ కామెంట్ చేశాడు.
Recommended Video


Click it and Unblock the Notifications











