»   » చిరు తమ్ముడు అయినా ఆయనకు అది లేదు: ముత్యాల సుబ్బయ్య

చిరు తమ్ముడు అయినా ఆయనకు అది లేదు: ముత్యాల సుబ్బయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవితో 'హిట్లర్', పవన్ కళ్యాణ్‌తో 'గోకుళంలో సీత' సినిమాలు వరుసగా చేసిన హిట్ కొట్టన సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసారు.

చిరంజీవి గారితో 'హిట్లర్' తీసిన తర్వాత లక్కీగా పవన్ కళ్యాణ్ గారితో 'గోకుళంలో సీత' సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ బిడియంగా ఉండే వాడు, బియడం అంటే కొంచెం సిగ్గరి. పవన్ కళ్యాణ్ అప్పటి నుండే చాలా కామ్ గోయింగ్ మనిషి అని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.

చిరంజీవి తమ్ముడైన అది లేదు

చిరంజీవి తమ్ముడైన అది లేదు

ఇప్పటి హీరోలు ఇండస్ట్రీకి ఎంటరైన తర్వాత ఒక సినిమా చేయగానే వాళ్ల ప్రవర్తనలో, మాట తీరులో చాలా తేడా కనిపిస్తోంది. కానీ ఆ రోజుల్లో చిరంజీవిగారి తమ్ముడు అయి ఉండి కూడా ఎలాంటి ఈగో లేకుండా అందరితో కలుపుగోలుగా పని చేసేవాడు పవన్ కళ్యాణ్ అని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.

గ్యాపు దొరికితే అంతే

గ్యాపు దొరికితే అంతే

అప్పట్లోనే ఆయన గ్యాపు దొరికితే ఏదైనా బుక్ చదువుకునే వాడు. ఆయనలో ఏదో తెలియని తపన ఉండేది. పది నిమిషాలు ఆయనతో మాట్లాడితే ఎంతో గొప్పగా అనిపించేది అని పవన్ కళ్యాన్ గురించి ముత్యాల సుబ్బయ్య తెలిపారు.

ఎక్కడికో ఎదిగిపోయాడు

ఎక్కడికో ఎదిగిపోయాడు

పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ చూసి ఆయన కమర్షియల్ హీరోగా ఎంత వరకు వస్తాడో అని అనుకునే వాడిని. అలాంటి ఆయన ఇపుడు ఎక్కడికో ఎదిగిపోయాడు. కేవలం ఆయన వల్లనే సినిమాలు ఆడేంత స్థాయికి వెళ్లాడు అని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.

అల్లాడిపోయేవాడు: పవన్ కళ్యాణ్ గురించి తమ్ముడు డైరెక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు!

అల్లాడిపోయేవాడు: పవన్ కళ్యాణ్ గురించి తమ్ముడు డైరెక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు!

అప్పల్లో అమ్మాయిలంటే పవన్ కళ్యాణ్ అల్లాడిపోయేవాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి తమ్ముడు డైరెక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు బయట పెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Director Mutyala Subbaiah interesting comments on Pawan Kalyan in Straight Talk with Telakapalli. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu