అమ్మాయిలు మీరు కూడా...దర్శకుడు ఎన్ శంకర్
మేమిచ్చిన పిలుపునందుకుని ఔత్సాహిక నటీనటుల నుంచి మొత్తం పదివేల దరఖాస్తులొచ్చాయి. అయితే దరఖాస్తుల్లో అమ్మాయిల నుంచి ఎక్కువ దరఖాస్తులు రాకపోవడం వెలితిగా ఉంది.మా చిత్రంలో ప్రధానమైన అమ్మాయిల పాత్రలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పటికైనా అమ్మాయిల నుంచి దరఖాస్తులొస్తే స్వీకరిస్తాం అంటున్నారు నిర్మాత, దర్శకుడు ఎన్ శంకర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో దర్శకుడు ఎన్ శంకర్ ఓ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన నటీనటులతో తీయనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రెండో విడత ఆడిషన్స్ జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే చిత్రం గురించి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు. నెలాఖరు నుంచి షూటింగ్ నిర్వహిస్తాం. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. అక్టోబర్ లో సినిమాని విడుదల చేస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











