తెలంగాణ వస్తోందంటూ ఆ తెలుగు డైరక్టర్..
తెలంగాణ ఉద్యమానికి బహిరంగ మద్దతు ఇచ్చిన దర్శకుడు ఎన్.శంకర్ తాజా పరిణామాలతో చాలా హ్యాపీగా ఉన్నారని సమాచారం. తన సన్నిహితులుతో ఆయన రాత్రి నుంచీ ఇదే విషయంపై ముచ్చట్లు అని పరిశ్రమ వర్గాల్లో చెప్తున్నారు. నిజానికి పరిశ్రమలోని ఎవరు మనస్సులో ఏమన్నా ఈ తెలంగాణా విషయంపై ఎవరూ పెదవి విప్పలేదు. అయితే ఎన్.శంకర్ మాత్రం వీటికి అతీతంగా..తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్న విధ్యార్ధి సంఘాలకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన నల్గొండకు చెందిన వ్యక్తి. ఆయన గతంలో ఎనకౌంటర్, భద్రాచలం, రామ్, ఆయుధం, శ్రీరాములయ్య,జయం మనదేరా, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడుగా నిబద్దత కలిగిన వ్యక్తిగా పేరొందిన ఆయనకు తెలంగాణా ఇష్యూ సెటిల్ కావటం ఆనందాన్నిస్తోంది. ప్రస్తుతం ఆయన అర్జున్ హీరోగా తమిళ,తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ లోనూ ఆయన కథ ఒకటి ఫైనల్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











