షాక్....ఆ దర్శకుడే హీరో రాజ్ తరుణ్ తండ్రి!
హైదరాబాద్: ‘ఉయ్యాల జంపాల' మూవీతో కెరీర్ మొదలు పెట్టి సక్సెస్ ఫుల్ గా తూసుకెలుతున్న యువ నటుడు రాజ్ తరుణ్.... ప్రస్తుతం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తండ్రి పాత్రలో దర్శకుడు ఎన్.శంకర్ నటిస్తున్నట్లు సమాచారం.
ఇద్దరి మధ్య చిత్రీకరించిన తండ్రీ కొడుకుల సీన్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఇప్పటి వరకు తెర వెనక దర్శకుడిగా ఉన్న ఎన్.శంకర్... నటుడిగా తెరపై కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమాకు సంబందించిన ఆడియోని ఈ నెల 10న విడుదలచేయాలని, సినిమాను జనవరి 29న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. ఈ సినిమా ద్వారా ఆర్తన అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది.

ఈ సినిమాకు భలే భలే మగాడివోయ్ సినిమాకు పని చేసిన గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ ఫూర్తి చేసుకున్న ఈ సినిమాకు డైరక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజ్ తరుణ్, అర్తన, రణదీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ,రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు, కథ-స్కీన్ ప్లే--దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.


Click it and Unblock the Notifications











