దయచేసి థియేటర్లు కూడా తెరవండి.. ప్రభాస్ దర్శకుడి ఆవేదన
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ దాదాపు రూ .10,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది, సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్‌ల రీ ఒపెనింగ్ పై ఇంకా ప్రభుత్వాలు సరైన స్పష్టత ఇవ్వడం లేదు. అయితే మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్, బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, దేవాలయాలు అలాగే ఇతర పబ్లిక్ హాట్‌స్పాట్‌లను దశల వారీగా తెరుచుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి.
గత రెండు నెలలుగా థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోంది. ఇక టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ డిమాండ్‌పై స్పందించారు. ట్విట్టట్ లో తన ఆలోచనను ఈ విధంగా తెలియజేశాడు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. మాల్స్, రెస్టారెంట్స్ వంటి అన్ని వ్యాపార సంస్థలకు యధావిధిగా నడుపుకునేందుకు అనుమతలు ఇస్తున్నారు.

అలాంటిది సినిమా థియేటర్లు కూడా తెరిచే సమయం కూడా దగ్గరపడినట్లు అర్ధమవుతోంది. సినిమాలు చూడటానికి కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మాస్క్ లు ధరించి సినిమాలు చూడవచ్చని.. ఈ విషయంలో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలని నాగ్ అశ్విన్ తనదైన.శైలిలో వివరణ ఇచ్చారు. ఇక ఈ దర్శకుడు మహానటి తరువాత ఇప్పుడు ప్రభాస్ తో ఒక పాన్ ఇండియా సినిమా కోసం వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. వైజయంతి ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సైన్స్ ఫిక్షన్ కథలో హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











