Project K: ప్రభాస్ అప్డేట్ ఇవ్వమంటే రాధేశ్యామ్ కు లింకు పెట్టిన దర్శకుడు.. ఫ్యాన్స్ అప్సెట్!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ఐదు ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ తన కెరీర్లో ఎప్పుడూ కూడా ఇంత దూకుడుగా కనిపించ లేదు. అదికూడా పాన్ ఇండియా లాంటి ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్ పైకి తేవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లడం అనేది కూడా సులువు కాదు. వందల కోట్ల బడ్జెట్ తో కూడుకున్న ఈ సినిమాలను ప్రభాస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో తెలియదు గానీ వచ్చే ఐదారేళ్ల వరకు కూడా చాలా బిజీ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు గత ఏడాది నుంచి వాయిదా పడుతూనే ఉంది.

ఇక వాయిదా సంగతి పక్కన పెడితే మాత్రం ప్రమోషన్ విషయంలో అయితే ఇంతవరకు చెప్పుకునే విధంగా సర్ ప్రైజ్ ఇచ్చింది లేదు. కేవలం ప్రభాస్ సినిమా అనే పాయింట్ తప్ప సినిమాపై ఇంతవరకు ఏ విధంగానూ బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. దర్శకుడు రాధాకృష్ణ నిర్మాతలు యూవీ క్రియేషన్స్ ఈ సినిమా విషయంలో అప్డేట్స్ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అంతేకాకుండా సినిమా అనుకున్నట్లుగా జరగలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ప్రేక్షకుల నుంచి గట్టిగానే వస్తున్నాయి. చాలా సార్లు అభిమానులు కోపం తట్టుకోలేక ప్రత్యేకంగా కొన్ని ట్యాగ్స్ కూడా వైరల్ అయ్యేలా చేశారు.

Director nag ashwin about project k updates after radheshyam

అప్పట్లో వివాదం ప్రభాస్ వరకు వెళ్లింది. అయినప్పటికీ అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం చిత్రయూనిట్ ఆలస్యంగానే కనిపిస్తుంది. ఇటీవల జనవరిలో పొంగల్ సందర్భంగా సినిమా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు కానీ ఈ సినిమాలోని ఒక పాటను కూడా విడుదల చేసింది లేదు. విడుదలైన పోస్టర్ కూడా అభిమానులకు అంతగా ఏమీ నచ్చలేదు. ఇక రీసెంట్ గా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా అప్డేట్ విషయంలో ఊహించని ఈ విధంగా రెస్పాండ్ అయ్యాడు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే ఒక సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అప్డేట్ విషయంలో ఇటీవల అభిమానులు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయగా అందుకు నాగ్ అశ్విన్ ఈ విధంగా స్పందించాడు. ఏదైనా ఇకనుంచి రాధేశ్యామ్ సినిమా తర్వాతే అంటూ చెప్పడంతో ఆ సినిమాపై తమకు నమ్మకం లేదని అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రాధేశ్యామ్ చిత్ర యూనిట్ సభ్యులు కూడా చెప్పిన సమయానికి ఏది విడుదల చేయలేదు. ప్రభాస్ పుట్టిన రోజు వస్తుండడంతో ఆరోజు ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. ఇక రాధేశ్యామ్ వాళ్ళు అప్డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ K విషయంలో మాత్రం ఆలస్యం కావద్దని నాగ్ అశ్విన్ ను కోరుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X