twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్, నాగ అశ్విన్ సినిమా స్టోరీపై రూమర్లు.. ఆ రెండు సినిమాలే స్ఫూర్తి అంటూ..

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్‌‌ను ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభాస్‌తో విభిన్నమైన సినిమాకు ప్లాన్ చేయడంతో అంచనాలు కూడా భారీగానే ఏర్పడుతున్నాయి. అయితే అప్పుడే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు, సినిమా కథ ఇదేనని కథనాలు మీడియాలో యాక్టివ్ అయిపోయాయి. ఈ సినిమా కథ గురించి వస్తున్న విషయాల గురించి వివరాల్లోకి వెళితే..

     మెగాస్టార్‌తో తీస్తానని చెప్పి..

    మెగాస్టార్‌తో తీస్తానని చెప్పి..

    మహానటి సినిమా తర్వాత జానపద నేపథ్యం లేదా అంతరిక్ష నేపథ్యంగా సినిమా తీయాలనుకొంటున్నట్టు నాగ అశ్విన్ మీడియాకు వెల్లడించారు. చిరంజీవి అంగీకరిస్తే ఆ సినిమా కథను మెగాస్టార్‌కు తగినట్టు రాసుకొంటానని చెప్పుకొచ్చారు. అయితే పలు కారణాల వల్ల నాగ అశ్విన్ సినిమాను చిరంజీవి చేయలేకపోయారనే వార్త రకరకాలుగా వినిపిస్తున్నది.

    పాతాళభైరవి, భైరవద్వీపం కథతో

    పాతాళభైరవి, భైరవద్వీపం కథతో

    అయితే ప్రస్తుతం నాగ అశ్విన్ రాసుకొన్న కథ గతంలో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి, బాలకృష్ణతో తీసిన భైరవద్వీపం మూవీ మాదిరిగా పక్కా జానపద చిత్రంగా రూపుదిద్దుకొంటుందని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రొటీన్, రెగ్యులర్ సినిమా కాధనేది సినీ వర్గాల అభిప్రాయం.

     జానపద ఛాయలున్న కథతో

    జానపద ఛాయలున్న కథతో

    నాగ అశ్విన్ రాసుకొన్న కథ నిజంగా జానపద నేపథ్యమున్నదైతే.. ప్రభాస్‌కు సరికొత్త జోనర్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జానపద ఛాయలున్న పాత్రను బాహుబలిలో పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక పూర్తిస్థాయి జానపద చిత్రం తెలుగు ప్రేక్షకులు చూసి చాలా కాలమే అయింది. జానపద చిత్రాలను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారనేది భైరవద్వీపంతో రుజువైన సంగతి తెలిసిందే.

     రీమేక్ కాదు.. బయోపిక్ కాదు..

    రీమేక్ కాదు.. బయోపిక్ కాదు..

    ప్రభాస్‌తో సినిమా ప్రకటించిన తర్వాత డైరెక్టర్ నాగ అశ్విన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను రూపొందించబోయే సినిమా రీమేక్ కాదు.. లేదా బయోపిక్ కాదు అని అన్నారు. ఓ కొత్త జోనర్‌గా ప్రాజెక్ట్ కోసం కథను రాసుకొంటున్నాను. పూర్తిగా ఒరిజినల్ స్టోరి. మంచి స్క్రీన్ ప్లేతో కథను నడిపించడానికి ఎక్కువ సమయం తీసుకొంటున్నాను. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ను ప్రారంభించి.. వచ్చే ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేస్తాను అని నాగ అశ్విన్ తెలిపారు.

    English summary
    Director Nag Ashwin is planning a pan world movie with Prabhas after Saaho. This project bank rolled by vyjayanthi movies, Which is produced by Ashwini Dutt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X