ఎన్టీఆర్‌ని మాత్రమే ఒప్పించలేకపోయాం.. ఆ ఆలోచన మంచిదే కానీ!
Recommended Video

లెజెండరీ నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. అన్ని ఏరియాలలో మహానటి చిత్రం మంచి వసూళ్ళని సాధిస్తోంది. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కుసరుస్తోంది. దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభని అంత కొనియాడుతున్నారు. ఈ చిత్రంలో పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. జెమినీగణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, మధురవాణిగా సమంత నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవర కొండ మరో కీలక పాత్రలో నటించాడు. మహానటి విజయాన్ని ఆస్వాదిస్తున్న నాగ అశ్విన్ ఫిల్మీబీట్ తో జరిగిన ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

మహానటి కథ
చిన్న నాటి నుంచి సావిత్రి గారిని అభిమానించడం వలనే ఆమె బయోపిక్ చేయాలనే ఆలోచన వచ్చిందని, సావిత్రిగారి గురించి చిన్ననాటి నుంచి తెలుసుకున్న విషయాలద్వారా, అధ్యయనం చేసి కథ సిద్ధం చేసినట్లు నాగఅశ్విన్ తెలిపాడు.

కీర్తి సురేష్‌లో సావిత్రిగారిని చూడగలిగారు
చాలా మంది అభిప్రాయం తెలుసుకున్నాకే మహానటి పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నాం అని నాగ అశ్విన్ తెలిపాడు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్. అందువల్లనే కీర్తిని సావిత్రిగా చూపించడం సులువైంది. ప్రేక్షకులను కూడా కీర్తిలో సావిత్రిగారిని చూస్తున్నారు అని నాగఅశ్విన్ తెలిపాడు.

ఎన్టీఆర్‌ని మాత్రమే
ఈ చిత్రంలో కామియో రోల్స్ కోసం చాలా మందిని ఒప్పించగలిగాం కానీ ఎన్టీఆర్ ని మాత్రమే ఒప్పించలేకపోయాం అని నాగఅశ్విన్ తెలిపాడు. కథ పరంగా సావిత్రి జీవితంలో జరిగిన అన్ని సంఘటనలని చూపించడం సాధ్యం కాదని అన్నారు.

వెబ్ సిరీస్ ఆలోచన
సావిత్రి జీవితంలో జరిగిన జరిగిన సంఘటనలని కథలో రాసుకున్నాం. అన్నింటిని చూపించడం సాధ్యం లేదు. వాటిని వెబ్ సిరీస్ రూపంలో చూపించే ప్రయత్నం చేయవచ్చు. కానీ తనకు వెబ్ సిరీస్ పై ఆసక్తి లేదని నాగశ్విన్ అన్నారు. వెబ్ సిరీస్ రూపొందిస్తే సూర్యకాంతం, రేలంగి వంటి వారందరి పాత్రలు చూపించడం సాధ్యం అవుతుందని నాగఅశ్విన్ అన్నారు.

కమర్షియల్ చిత్రం
తదుపరి కమర్షియల్ చిత్రం తీసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు నాగఅశ్విన్ ఆసక్తికరమైన సమాధారం ఇచ్చారు. మహానటే ఓ పెద్ద కమర్షియల్ చిత్రం అని అన్నారు. కమర్షియల్ చిత్రాలు తరహాలోనే మహానటి చిత్రంపై ముందునుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంచనాలు తగట్లుగా వసూళ్లు వస్తున్నాయి. బయ్యర్లకు లాభాలు వస్తున్నాయని నాగఅశ్విన్ అన్నారు.


Click it and Unblock the Notifications











