ఏంటి 'మహేష్' అంటున్నావ్ అంటూ లేడి డైరెక్టర్ పై మహేష్ రియాక్షన్.. లేకపోతే బేబీ అనాలా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకులతో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయనకు కనెక్ట్ అయితే ఎవరిని కూడా అంతా దూరం చేసుకోరు. మెహర్ రమేష్ ఇప్పటికి కూడా మహేష్ బాబు తో చాలా క్లోజ్ గా ఉంటాడు. ఆయనతో వర్క్ చేసిన ప్రతి దర్శకుడు కూడా మహేష్ బాబు తో వర్క్ చేస్తే మంచి ఫ్రీడం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఒక లేడీ డైరెక్టర్ మాత్రం మహేష్ బాబుతో వర్క్ చేస్తున్నప్పుడు.. మహేష్ పిలవడంతో అతను ఏంటి అని అడిగాడట. ఇక ఆ తర్వాత ఆమె అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరో గానే కాకుండా..
సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను కేవలం ఒక స్టార్ హీరో గానే కాకుండా నలుగురికి సహాయపడే మంచి మానవత్వం ఉన్న వ్యక్తిగా కూడా ఎంతో కీర్తిని అందుకున్నాడు. పలు గ్రామాలను దత్తత తీసుకుని వాటికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ఉండే మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు కూడా హార్ట్ సర్జరీ చేయించి దేవుడుగా నిలిచాడు అనే చెప్పాలి.

రెండు వేల మంది చిన్నారులకు..
దాదాపు రెండు వేల మంది చిన్నారులకు మహేష్ బాబు గుండె సంబంధిత వ్యాధులకు శస్త్ర చికిత్స చేయించారు. ఒక విధంగా మహేష్ బాబు సినిమాల కంటే కూడా తన వ్యక్తిత్వంతోనే అభిమానులు కూడా ఎంతో దగ్గరవుతున్నాడు. ఆయనతో సినిమాకు పని చేసే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఆయనతో మళ్ళీ చేయాలని అనుకుంటారు.

మహేష్ బాబుతో వర్క్ చేస్తే..
ఇటీవల సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చిన దర్శకులు అందరూ కూడా మహేష్ బాబుతో వర్క్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంటుంది అని తెలియజేశారు. ఎందుకంటే మహేష్ బాబు ఒకసారి కథ ఓకే చేస్తే మాత్రం మళ్ళీ ఎలాంటి విషయాల్లో కూడా తలదూర్చడని ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్క దర్శకుడు తెలియజేశారు. మహేష్ బాబు సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు అని కూడా చెబుతూ ఉంటారు.

నందిని రెడ్డి కామెంట్స్
అయితే ఒక లేడీ డైరెక్టర్ మాత్రం మహేష్ ఎదురైన ఒక మరచిపోలేని సంభాషణ గురించి తెలియజేశారు. ఆమె మరెవరో కాదు 'అలా మొదలైంది' - 'ఓ బేబీ' సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నందిని రెడ్డి. ఆమె కృష్ణవంశీ దగ్గర కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మురారి సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు తో ఎదురైన ఒక అనుభవం గురించి వివరణ ఇచ్చింది.

ఏంటి బేబీ.. బాబు.. అని పిలవాలా?
షూటింగ్ లో.. 'మహేష్ షాట్ రెడీ' అని చెప్పగానే ఆయన నన్ను ఒక విధంగా చూశారు. ఏంటి 'మహేష్' అంటున్నావ్ అని అన్నాడు. అలా అనగానే నేను 'ఏంటి బేబీ బాబు అని పిలవాలా?' అని అన్నాను. అందుకు ఆయన గట్టిగా నవ్వేసి ఆ తర్వాత చాలా స్నేహంగా మారిపోయారు. మహేష్ బాబుతో నాకు ఆ సినిమా ద్వారా మంచి స్నేహం ఏర్పడింది. చాలా అల్లరిగా సరదాగా ఉంటాడు. మహేష్ బాబు సోదరి మంజుల గారు కూడా ఒక సమయంలో మహేష్ బాబుతో సినిమా చేయాలి అని కూడా అన్నారు. ఇక ఎప్పుడు కలిసిన కూడా మహేష్ బాబు అంతే స్నేహంగా ఉంటాడు.. అని నందిని రెడ్డి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











