Rahul Ravindran చిన్మయి భర్త రాహుల్ రవింద్రన్ రెండో పెళ్లి... బయటపడిన డైరెక్టర్ చాట్?

ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద భర్త రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాహుల్ రవీంద్రన్ పలు సినిమాల్లో హీరోగా నటించి.. ఇప్పుడు డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు. ఇక రాహుల్ రవీంద్రన్ రెండో పెళ్లంటూ నెటిజన్స్ అనుకుంటున్నారు. దానికి కారణం రాహుల్ రవీంద్రన్, డైరెక్టర్ నందీని రెడ్డి చాట్ బయటకు రావడమే అని తెలుస్తోంది. ఆ చాట్ చూసి... రాహుల్ రవీంద్రన్ రెండో పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సింగర్ చిన్మయి శ్రీపాద భర్త రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ రవీంద్రన్.. చాలా మందికి అందాల రాక్షసి సినిమా హీరోగా తెలుసు. ఇక ఈయన హీరోనే కాదు.. డైరెక్టర్ కూడా. ఇక రాహుల్ రవీంద్రన్, చిన్మయి, వెన్నెల కిషోర్, నందినీరెడ్డి, సమంత.. వీళ్లంతా ఫ్రెండ్స్. వీరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే నందినీరెడ్డి, రాహుల్ రవీంద్రన్ చాట్ బయటకు వచ్చింది.

Director Nandini Reddy Comments on singer Chinmayi Husband Rahul Ravindran Second Marriage Full Details Here

న్యూ ఇయర్ సందర్భంగా నందినీ రెడ్డి రాహుల్ రవీంద్రన్ కు విషెష్ చెబుతూ మెసెజ్ పెట్టింది. అందులో... రాహులా హ్యాపీ న్యూ ఇయర్ రా... ఈ ఏడాది అయినా ఓ గర్ల్ ఫ్రెండ్‌ ను సంపాదించుకో.. నీ వైఫ్ కూడా నాకు తెలిసి ఇదే కోరుకుంటుంది.. ఆమె ఏమీ అనుకోదు..ఆమె కూడా అంగీకరిస్తుందిలే అంటూ రాసుకువచ్చింది. అయితే నందినీ రెడ్డి చేసిన చాట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక ఈ చాట్ ను రాహుల్ రవీంద్రన్ స్క్రీన్ షాట్ తీసి... ఏంటి ఇలా ఎవరైనా విషెస్ చెబుతారా? అంటూ రాహుల్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం వీరద్దిరి ట్వీట్ల ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందినీ రెడ్డి తప్పా ఇంకెవ్వరూ ఇలా విషెస్ చెప్పలేరంటూ రాహుల్ ఫన్నీగా స్పందించాడు.

Director Nandini Reddy Comments on singer Chinmayi Husband Rahul Ravindran Second Marriage Full Details Here

అయితే కొంతమంది రాహుల్ రవీంద్రన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని.. అందుకే నందినీ రెడ్డి అలా పెట్టిందంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అందుకే నందీని రెడ్డి గర్ల్ ఫ్రెండును తెచ్చుకో అంటూ సలహా ఇచ్చిందని అంటున్నారు. మరి కొంత మంది.. నందినీ రెడ్డి గర్లఫ్రెండ్ అని చెప్పింది కదా.. ఆ గర్ల ఫ్రెండ్ ఎవరో కాదు.. రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ కు రష్మిక మందన్నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి అనుకున్నారా.. దానికి ఓ లెక్క ఉంది.

రష్మిక అని ఎందుకు అంటున్నారంటే.. రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుంది. ఇక అందుకే నందినీ రెడ్డి అలా మెసెజ్ చేసినట్లు అర్థం అవుతుంది. ఈ ఏడాది గర్ల్ ఫ్రెండ్ సినిమా హిట్ కొట్టాలనే ఉద్ధేశంతో అలా చేసిందని.. ఆ సినిమా హిట్ అయితే చిన్మయి కూడా సమర్థిస్తుంది కాబట్టి అలా చేసిందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా నందినీరెడ్డి, రాహుల్ రవీంద్రన్ చాట్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X