KGF2, ప్రశాంత్‌ నీల్‌‌ను కించపరిచేలా వెంకటేష్ మహా వ్యాఖ్యలు.. సారీ చెప్పిన డైరెక్టర్ నందినీ రెడ్డి

సంచలన విజయం సాధించిన కేజీఎఫ్, ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై దర్శకుడు, నటుడు వెంకటేష్ మహా చేసిన అనుచిత వ్యాఖ్యలు అత్యంత వివాదంగా మారాయి. మదర్ సెంటిమెంట్‌పై వచ్చిన చిత్రాన్ని, హీరో క్యారెక్టరైజేషన్‌ను కించపరుస్తూ అవహేళనగా మాట్లాడిన వ్యవహారంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా వెకిలిగా నవ్వుతూ ఇంద్రగంటి మోహన్ కృష్ణ, వివేక్ ఆత్రేయ, నందినిరెడ్డి మద్దతు ఇవ్వడాన్ని సినీ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ వివాదంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

కేజీఎఫ్ కథ, ప్రశాంత్ నీల్ కథనంపై

కేజీఎఫ్ కథ, ప్రశాంత్ నీల్ కథనంపై


దర్శకుడు వెంకటేష్ మహా ఇటీవల నిర్వహించిన రౌండ్ టేబుల్ డిబేట్‌లో మాట్లాడుతూ... నేను ఆ సినిమా పేరు చెప్పను. ఓ తల్లి తన కొడుకుని నీవు ఎప్పటికైనా గొప్పవాడు కావాలనుంటుంది. గొప్పవాడంటే బాగా డబ్బు సంపాదించి అందరికి మంచి చేయాలని కోరుకొంటుంది. తల్లి కొంత బంగారం కావాలని కోరుకొంటుంది. గోల్డ్ మైన్‌లో పనిచేసే కార్మికులను హీరో ఉద్దరిస్తాడు. చివరకు మొత్తం బంగారాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తాడు. అలాంటి హీరో ఎంత నీచ్ కమీన్ కుత్తే గాడు కాకపోతే.. చివరకు వేల మందికి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇచ్చి.. బంగారం మొత్తం సముద్రం పాలు చేస్తాడు. అలాంటి నీచ్ కమిన్ కుత్తేగాడు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు.

వెంకటేష్ పై నెటిజన్లు కామెంట్స్

వెంకటేష్ పై నెటిజన్లు కామెంట్స్

దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక సినిమా దర్శకుడు మరో దర్శకుడిని కించపరిచేలా మాట్లాడుతుంటే సరికాదు. మాకు బాధగా ఉంది అని కామెంట్లు పెడుతున్నారు.

 నందిని రెడ్డి క్షమాపణ

నందిని రెడ్డి క్షమాపణ


అయితే వివాదం ముదురుతున్న సమయంలో నందినీ రెడ్డి స్పందిస్తూ.. సినిమాలో పెట్టిన ఎఫర్ట్‌ను చూసి ప్రేక్షకులు ఆదరిస్తేనే ప్రతీ కమర్షియల్ హిట్ అవుతుంది. ఒకరిని కించపరచడం ఆ చర్చలో మా ఉద్దేశం కాదు. కమర్షియల్ సినిమాలకు సంబంధించిన వివిధ అంశాలను పాజిటివ్‌గా చర్చించాం. ఎవరైనా మా మాటలకు, మా తీరుకు బాధపడినట్టయితే అందుకు క్షమాపణ అని నందినీ రెడ్డి ట్వీట్ చేశారు.

తోటి డైరెక్టర్‌ను కించపరిస్తే నవ్వుతారా?

తోటి డైరెక్టర్‌ను కించపరిస్తే నవ్వుతారా?


నందినీ రెడ్డి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. మీరంటే గౌరవం.. మీ సినిమాలు చూడాలని అనుకొంటాం. పూణేలో ఏ థియేటర్‌లో ఉన్నా.. వెళ్లి చూడాలనుకొంటాం. అలాంటి మీపై మంచి గౌరవం ఉంది. కానీ ఒక తోటి దర్శకుడిని కించపరుస్తూ మాట్లాడటం సరిగా లేదు అని నెటిజన్ ఘాటుగా స్పందించారు.

కేజీఎఫ్ సినిమా చూసిన వాళ్లు ఫూల్సా?


అయితే నెటిజన్ కామెంట్‌కు నందీని రెడ్డి స్పందిస్తూ.. క్షమించండి. వెంకటేష్ మహా హావభావాలను చూసి నవ్వుకొన్నాం. కానీ ఒక దర్శకుడిని తిడుతున్నందుకు వచ్చిన నవ్వు కాదు అని వివరణ ఇచ్చే ప్రయత్నాన్ని నందిని రెడ్డి చేసింది. అయితే నందిని రెడ్డి కామెంట్‌పై మరో నెటిజన్ స్పందిస్తూ కేజీఎఫ్ మూవీని చూసినందుకు మనల్ని ఫూల్స్‌లా లెక్కకట్టారు. కేజీఎఫ్ సినిమాను హిట్ చేసినందుకు మనల్ని అలా చూస్తున్నారు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X