దర్శకుడి రోత వ్యవహారంపై హీరోయిన్ మనస్తాపం!
దక్షిణాదిన చిన్న సినిమాల్లో రాణిస్తూ...అడపా దడపా అవకాశాలతో నెగ్గుకొస్తున్నమధుశాలినిని రామ్ గోపాల్ వర్మ ఏకంగా బాలీవుడ్‌కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్లో రూపొందిస్తున్న 'డిపార్ట్‌మెంట్' చిత్రంలో మధుశాలినికి అవకాశం ఇచ్చాడు. ఈచిత్రంలో సిగరెట్లు తాగుతూ, మందుకొడుతూ ఉండే లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఈ భామ నటిస్తోంది. వాస్తవానికి ఈ చిత్రంలో మధు శాలినితోనే ఓ ఐటం సాంగు చేయిస్తానని మాట ఇచ్చిన వర్మ తర్వాత..మాట తప్పి బ్రెజిల్ సెక్సీ మోడల్ నతాలియాను తీసుకున్నాడు. నాకు మాట ఇచ్చి ఆమెను ఎందుకు తీసుకున్నావ్ అంటూ మధు శాలిని ప్రశ్నిస్తే...సంజయ్ దత్ నిన్ను ఐటం సాంగులో వద్దన్నాడని ఏవో సాకులు చెప్పాడట. దీంతో మధు శాలిని సైలెంట్ అయిపోయింది.
అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి...నతాలియాను తెగ పొగిడేసాడు. ఆమె అందం అద్భుతం, ఆమెలాంటి సెక్సీ ఫిగర్‌ను నేను ఇంత వరకు చూడలేదు, ఆమె అందాన్ని పూజిస్తున్నా, ఆమె అందానికి నేను భక్తిడిని అయిపోయాను అంటూ....నతాలియాను ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో చిర్రెత్తిన మధు శాలిని, వర్మ రోతగా వ్యవహరిస్తున్నాడని, నాతో ఐటం సాంగు చేయిస్తానని మాట తప్పాడని, ఇప్పడేమో సిగ్గు లేకుండా ఆమె అందాన్ని అడ్డుపెట్టుకుని సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడని మండి పడుతోందట.


Click it and Unblock the Notifications











