ఆదిపురుష్ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. అసలు కథ మొదలైంది
రెబల్ స్టార్ ప్రభాస్ గ్యాప్ ఇవ్వకుండా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సినిమా తరువాత మరొక సినిమాను ఫినిష్ చేయాలని భుజాలపై బాహుబలి కంటే పెద్ద భారాన్ని మోస్తున్నాడు. ఇక మొదటిసారి పూర్తిగా బాలీవుడ్ టెక్నీషియన్స్ తో బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్
బాలీవుడ్ ఇంటిలిజెంట్ టెక్నీషియన్స్ లో ఒకరైన ఓం రావత్ బిగ్ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. రామాయణం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

త్వరలోనే ఆ విషయంపై క్లారిటీ
ఈ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి రూమర్స్ భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. రామాయణం స్టోరీ కావడం వలన మరికొన్ని ముఖ్యమైన పాత్రల్లో ఎవరు నటిస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సీత పాత్రలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఆ విషయంలోనే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రాఫిక్స్ హై లెవెల్లో ఉండేలా
ఇక మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ఓం రావత్ కొన్ని వర్క్ షాప్ లను కూడా నిర్వహించారు. సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ మొత్తం ఆల్ మోస్ట్ సెట్టయ్యారు. సినిమాను ఎక్కువ భాగం VFX తోనే తెరకెక్కిస్తున్నారు. పక్కా ప్లాన్ తో గ్రాఫిక్స్ హై లెవెల్లో ఉండేలా ప్లాన్ సెట్ చేసుకున్నారు.

ఆదిపురుష్ ఆరంభం
ఇక దర్శకుడు ఓం రావత్ మరో అప్డేట్ ఇచ్చాడు. సినిమా అసలు పని ఇప్పుడే మొదలైందట. ఆది పురుష్ ఆరంభం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు. ఇక వీలైతే ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలోనే విడుదల చేయావచ్చని అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

సీత పాత్రకు కోసం..?
ఈ పాన్ ఇండియా సినిమాలో సీత లాంటి పాత్ర చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒక ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. ఇక కృతి సనోన్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా పూర్తిగా ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర యూనిట్ ఊహాగానాలను ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి.
Recommended Video

సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో..
ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ రోజే మొదలు పెట్టారు.. ఇక ఇటీవల ప్రభాస్ సలార్ సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ను కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారు. ఇక ఆది పురుష్ సినిమాను 2022 సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని దర్శకుడు ఓం రావత్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











