Adipurush కథను ఆ హీరోలు రిజెక్ట్.. ప్రభాస్ సెలెక్షన్ పై దర్శకుడి క్లారిటీ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక విడుదలైన మొదటి రోజే ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో నిరూపించాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.
అయితే ఈ సినిమాను తెరపైకి తీసుకు రావాలి అని అనుకున్నప్పుడు కొంతమంది బాలీవుడ్ హీరోలతో చర్చించినట్లు టాక్ వచ్చింది. ఇక కొందరు రిజెక్ట్ చేసిన తరువాత ఈ సినిమా కథ ప్రభాస్ వద్దకు చేరినట్లు చెబుతున్నారు. ఇక దర్శకుడు ఓం రౌత్ ఇటీవల చేసిన కామెంట్స్ ద్వారా ఆ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ సంచలనం: ఆదిపురుష్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 340 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకుందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. మరో వైపు సినిమాలో రామాయణం కథ, పాత్రలని పూర్తిగా వక్రీకరించారు అంటూ నార్త్ ఇండియా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు.

ప్రభాస్ మూవీగా: చాలా థియేటర్స్ లో కూడా సినిమాని ప్రదర్శించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాత్రల చిత్రణ, సంభాషణలు పూర్తిగా హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే సౌత్ లో మాత్రం ప్రేక్షకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం లేదు. ఆదిపురుష్ సినిమాని రామాయణం కోణం నుంచి కాకుండా ప్రభాస్ మూవీగా చూస్తున్నారు. అందుకే మెజారిటీగా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సౌత్ లో వస్తోంది.

బాలీవుడ్ స్టార్స్ రిజెక్ట్?: ఇదిలా ఉంటే సినిమాలో శ్రీరాముడి పాత్ర కోసం ఓం రౌత్ ప్రభాస్ కంటే ముందుగా బాలీవుడ్ స్టార్స్ ని కూడా సంప్రదించారనే ప్రచారం నడుస్తోంది. అయితే బాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఈ కథ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఫైనల్ గా ప్రభాస్ ని తీసుకున్నారు అంటూ బిటౌన్ లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఆ విషయంలో ఎలాంటి నిజం లేదని ఇటీవల ఓం రౌత్ ఇచ్చిన క్లారిటీతో అర్ధమయ్యింది.

కథ అనుకున్న తర్వాత తనకు ప్రభాస్ మాత్రమే: ఈ ప్రచారం పై దర్శకుడు ఓం రౌత్ తాజాగా స్పందించారు. ఆదిపురుష్ సినిమా కథ అనుకున్న తర్వాత తనకు ప్రభాస్ మాత్రమే కనిపించారని ఓం రౌత్ చెప్పారు. అతని కళ్ళల్లో నీతి, నిజాయితీ కనిపిస్తూ ఉంటాయి. అంత పెద్ద స్టార్ అయిన చాలా వినయంగా ఉంటారు.
అందుకే తాను శ్రీరాముడి పాత్రకి కేవలం ప్రభాస్ ని మాత్రమే అనుకోని అతనిని సంప్రదించడం జరిగింది. అయితే ప్రభాస్ అంత సులభంగా ఒప్పుకోలేదని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ఫైనల్ గా అతనిని అతి కష్టం మీద ఒప్పించి ఆదిపురుష్ చేయడం జరిగిందని ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు. అయితే బాలీవుడ్ హీరోలని సంప్రదించడంపై మాత్రం ఓం రౌత్ స్పందించలేదు.


Click it and Unblock the Notifications











