రామాయణం ట్రోల్స్ పై ఓం రౌత్ ఊహించని రియాక్షన్.. వాళ్ళు మూర్ఖులు అంటూ..
రామాయణం కథ ఆధారంగా చేసుకొని ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాని తెరకెక్కించారు. మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే సోమవారం నుంచి దారుణంగా పడిపోయాయి. తెలుగు నాట ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుని ఓ మోస్తరు కలెక్షన్స్ కి అందుకోగలుగుతోంది. అయితే ఈ చిత్రం దేశ వ్యాప్తంగా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి ప్రధాన కారణం సినిమాలోని ఉన్న సంభాషణలు అని చెప్పాలి.
ఆ తరువాత పాత్రల చిత్రణపైన కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్, డైలాగ్ రైటర్స్ ని అయితే హిందూ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొంతమంది అయితే నేరుగా చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా తీసిన ఆదిపురుష్ సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నార్త్ ఇండియాలో అయితే థియేటర్స్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే సీనియర్ నటులు కూడా తీవ్ర స్థాయిలో ఆదిపురుష్ సినిమాలో రామాయణం చూపించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నడూ లేని స్థాయిలో ఓం రౌత్ ఆదిపురుష్ తో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓం రౌత్ నెగిటివ్ రివ్యులపై అలాగే ట్రోల్స్ పై తనదైన శైలిలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
రామాయణం కథ ఎవరికి పూర్తిగా అర్ధం కాదని, దీనికి విరుద్ధంగా మాట్లాడేవారు కచ్చితంగా వాళ్ళు మూర్ఖులు లేదంటే అబద్దాలు ఆడుతున్నారని అర్ధం. ఆదిపురుష్ చిత్రాన్ని మేము పూర్తిగా రామాయణం అని చెప్పడం లేదు. నాకు కూడా అర్ధమైనంత వరకు యుద్ధఖాండని తీసుకొని సినిమా తెరకేక్కించానని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఆదిపురుష్ రైటర్ కూడా ఇదే విధంగా హనుమంతుడు దేవుడు కాదని, కేవలం భక్తుడు మాత్రమే అంటూ ఓ మీడియా ఛానల్ లో కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











