వెంకటేష్ 'ఔర ఔర ఔర ఔరా' రజనీ రేంజి కిక్కిస్తుందా?
సంచలన విజయం సాధించిన చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ ..."లక లక లక లక" అంటూ చెప్పే డైలాగుకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసు. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ లో అలాంటి సైక్రాటిస్టు పాత్రనే చేస్తున్న వెంకటేష్ దాన్ని మార్చి "ఔర ఔర ఔర ఔరా" అనబోతున్నారు. అయితే రజనీ రేంజిలో వెంకటేష్ కంఠం మ్రోగుతుందా...అభిమానులను అలరిస్తుందా అనేది అంతటా చర్చగా మారింది. ఇక ఈ చిత్రానికి నాగవల్లి..ది రిటన్ ఆఫ్ చంద్రముఖి అనే టైటిల్ ని పెట్టారు. ఈ 'నాగవల్లి' చిత్రంలో అనుష్క, కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్, రిచా గంగోపాధ్యాయ కనిపిస్తారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ ఆప్త రక్షక డైరక్ట్ చేసిన పి.వాసు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇక ఈ చిత్రం విశేషాలు మీడియాకు దర్శకుడు పి.వాసు తెలుపుతూ "చంద్రముఖి వారసురాలి కథ ఇది. కేవలం భయపెట్టడమే ఉద్దేశ్యం కాదు. ఆద్యంతం ఆలోచన, ఆసక్తిని రేకెత్తించే గమ్మత్త్తెన చిత్రం ఇది. వెంకటేష్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుందని అన్నారు. బ్రహ్మానందం, ధర్మవరపు, శరత్ బాబు, అవినాష్, ప్రభ, రక్ష, పూనమ్ కౌర్, సుజాత తదితరులు ఇతర పాత్రధారులు. మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: గురుకిరణ్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు.


Click it and Unblock the Notifications











