Sarkaru vaari paata: ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవడం ఖాయం.. అలా ఉంటుంది మరి: డైరెక్టర్ సవాల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మొత్తానికి సెట్స్ పైకి వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు సరికొత్త లుక్ తో కనిపిస్తుండడంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక సినిమాపై ఇటీవల దర్శకుడు పరశురామ్ మరో క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ చొక్కాలు చినిగిపోయేలా ఉంటుందని కామెంట్ చేశారు.

ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని
దర్శకుడు పరశురామ్ గీతాగోవిందం సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న వెంటనే నాగచైతన్యతో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని అనుకున్నాడు. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండడంతో నాగచైతన్య అనుమతి తీసుకొని సినిమాను స్టార్ట్ చేశాడు.

నెవ్వర్ బిఫోర్ అనేలా
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మహేష్ బాబు నెవ్వర్ బిఫోర్ అనేలా న్యూ లుక్ తో సిద్ధమయ్యాడు. హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇక కీర్తి సురేష్ లాంటి క్యూట్ హీరోయిన్ తో మొదటిసారి రొమాన్స్ చేయబోతున్నాడు కాబట్టి ఆ కెమిస్ట్రీ కూడా ఆసక్తిని కలిగిస్తోంది.

ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్
ఇక కరోనా సెకండ్ వేవ్ అనంతరం మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సెట్స్ వద్దకు మీడియా వెళ్లగా దర్శకుడు పరశురామ్ తన మాటలతోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాడు. నాకు మహేష్ బాబుతో ఛాన్స్ దొరకడం ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు.
Recommended Video

చొక్కాలు చించుకోవడం కాయం
పేట సినిమాకి రజనీకాంత్ సర్ ఫ్యాన్స్ ఎలా అయితే షర్ట్ లు చించుకున్నారో.. సర్కారు వారి పాటకు కూడా ఫ్యాన్స్ అలానే చించుకుంటారు. ఫ్యాన్స్ స్టఫ్ కు ఒక మెస్సేజ్ తోడైతే ఎలా ఉంటుందో మీరు చూస్తారు.. అంటూ దర్శకుడు పరశురామ్ ఆల్ మోస్ట్ ఒక సవాల్ అయితే విసిరాడు. మరి సినిమా అభిమానుల అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











