నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ని చూసుకొంటున్నారు

By Srikanya

ఎన్టీఆర్‌ని మళ్లీ తెరపై చూసిన అనుభూతి కలిగిందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం నాకు దక్కలేదు. ఇప్పుడు మాత్రం ఆ కోరిక నెరవేరినట్టుగానే ఉంది. పెద్దాయన హరిశ్చంద్రప్రసాద్‌ పాత్రలో బాలకృష్ణని చూపించిన విధానం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ''అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అధినాయకుడు'. బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ప్రమోషన్ లో భాగంగా దర్సకుడు ఇలా స్పందించారు.


అలాగే...ప్రపంచ పటంలో ఇండియాని వివేకానందుడు ఎలా పైకి తీసుకువచ్చారో, ఈ చిత్రంలో బాలయ్య చేసిన పెద్దాయన పాత్ర ఆ విధంగా సినిమా స్థాయిని పెంచింది. ఈ పాత్రలో ఎన్టీఆర్‌ని చూసిన ఫీలింగ్ కలిగిందని ఓ ప్రేక్షకుడు అన్నప్పుడు ఆనందపడ్డాను. ఇది వివాదాస్పదమైన కథాంశంతో రూపొందిన చిత్రం కాదు. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం అని మురళి అన్నారు.

ఇక కథ తయారైన విధం చెప్తూ..''బాలకృష్ణని మూడు పాత్రల్లో చూపెడుతూ ఒక చక్కటి కుటుంబ కథాచిత్రం తీయాలనే ఈ కథ తయారు చేసుకొన్నాను. మూడు పాత్రల్నీ తెరపై మూడు కోణాల్లో తీర్చిదిద్దాను. పెద్దాయన పాత్రలో బాలకృష్ణని చూసుకొన్నప్పుడు నాకు వివేకానందుడు గుర్తొచ్చాడు. అంతటి విలువలతో కూడుకొన్న పాత్ర అది. బాలకృష్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో ఎవ్వరినీ విమర్శించలేదు. ఎలాంటి వివాదాస్పదాంశాలు లేవు. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది''అన్నారు.

నిర్మాత ఎమ్.ఎల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. ''రాజకీయ పార్టీలకు, ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేని సినిమా ఇది. చక్కటి కుటుంబ విలువలతో తెరకెక్కించారు దర్శకుడు. బాలకృష్ణ మూడు పాత్రల్లో ఒదిగిపోయిన విధానం అందరికీ నచ్చుతుంది. కల్యాణి మాలిక్‌ సంగీతం చిత్రానికి బలాన్నిచ్చింది. సినిమాకి లభిస్తున్న ఆదరణ, వసూళ్లు సంతృప్తినిస్తున్నాయ''అ న్నారు. ఈ సమావేశంలో కాశీవిశ్వనాథ్‌, కల్యాణి మాలిక్‌ పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X