»   » రచయిత, దర్శకుడు పూసల ఇక లేరు

రచయిత, దర్శకుడు పూసల ఇక లేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ రచయిత, దర్శకుడు పూసల వీర వెంకటేశ్వరరావు(74) కన్నుమూసారు. ఇటీవల కేర్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఎదురవ్వడంతో ఆదివారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Director Poosala Is No More

రచయితగా 64 కథలు రచించిన ఆయన ‘డాలర్ కి మరో వైపు' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చదువుకునే రోజుల నుండి నాటకరంగంపై పూసలకు మంచి పట్టుంది. ఆయన రచించిన, నటించిన ‘మండువ లోగిలి' నాటకానికి బళ్లారి రాఘవ అవార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్నారు.

ఇటీవల జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రధారుడుగా ఆయన డైరెక్ట్ చేసిన ‘అలెగ్జాండర్' నాటకానికి చక్కని ప్రశంసలు అందుకున్నారు. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ‘డాలర్ కి మరో వైపు' సినిమా మార్చిలో విడుదలకు సిద్దంగా ఉంది. పూసల అంత్యక్రియలు సోమవారం ఎర్రగడ్ర శ్మశానవాటికలో జరుగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

English summary
Popular film director and writer Poosala Veera Venkateswara Rao (74) passed away on Sunday morning. He was suffering from longstanding illness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu