ఐటం సాంగ్ సుకుమార్ రేంజ్‌లో...
మా చిత్రంలోని ఐటం సాంగ్ మా గురువు గారు సుకుమార్ రేంజ్‌లో ఉంటుంది. హంసానందిని, మరియం జకారియా(100%లవ్ ఫేం), మునీరా ఈ సాంగ్‌లో నర్తించారు అంటున్నారు తోలేటి ప్రకాష్. సుకుమార్ చిత్రాల్లో మొదటి నుంచి ఐటమ్ సాంగ్ లకు ప్రత్యేకత ఉంది. మొదటి సినిమా ఆర్య నుంచి మొన్న రిలీజైన 100% లవ్ చిత్రం వరకూ ఐటం సాంగ్ లు సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు ఆయన శిష్యుడు కూడా అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నాడు. సుకుమార్ శిష్యుడు తోలేటి ప్రకాష్ దర్శకత్వంలో 'నా ఇష్టం'చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా, జెనీలియా కాంబినేషన్ లో రూపొందున్న ఈచిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే..మా చిత్రం ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ లవ్‌స్టోరి ఇది. నా తొలి సినిమాకి హీరోగా రానా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను . ఇక పాటల విషయానికొస్తే చక్రి గారు అద్భుతమైన 7 పాటలనిచ్చారు. 2012 లోనే టాప్ పొజిషన్‌లో 'నా ఇష్టం' పాటలు నిలుస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. కునాల్ గంజ్వాల, అద్నాన్ సమి, మమతా శర్మ,కె.కె, షాన్ వంటి పాపులర్ సింగర్స్ ఆలపించారు. 4 పాటలను ప్రతి ఒక్కరూ హమ్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మా అందరికీ పెద్ద విజయాన్ని చేకూరుస్తుందని ఆశిస్తున్నాము అన్నారు.
బ్రహ్మానందం, హర్షవర్థన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, ఆలీ, భరత్, ఉత్తేజ్, చిత్రం శ్రీను, గిరి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, జోగి బ్రదర్స్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, రచనాసహకారం: చంద్రశేఖర్, టి.రమేష్, వేమారెడ్డి, శ్రీకర్, ఫొటోగ్రఫీ: వెంకట్‌ప్రసాద్, సంగీతం: చక్రి, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ తోలేటి.


Click it and Unblock the Notifications











